పుష్ప 2… కోలీవుడ్ లో రెస్పాన్స్ ఎలా ఉందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాకి మొదటి రోజు దేశ వ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ లభించింది.

Update: 2024-12-06 06:46 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాకి మొదటి రోజు దేశ వ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ లభించింది. సినిమాపైన ఉన్న హైప్, క్రేజ్ నేపథ్యంలో మొదటి రోజు ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఈ రెస్పాన్స్ కలెక్షన్స్ లలో స్పష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా ‘పుష్ప 2’ మొదటి రోజు 175+ కోట్లకి పైగా కలెక్షన్స్ వసూళ్లు చేసిందని అంటున్నారు. మేకర్స్ లెక్కలు ఎలా ఉన్నాయనేది ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా ఆరు ఇండియన్ భాషలలో రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు సౌత్ లో మూడు భాషలలో సినిమా రిలీజ్ అయ్యింది. తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో కూడా ఈ సినిమాపై భారీగానే క్రేజ్ ఉంది. అందుకే ఈ భాషలలో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక తమిళనాడులో ఈ సినిమాకి మొదటి రోజు 70% ఆక్యుపెన్సీ అయ్యిందని అంటున్నారు. నిజానికి తెలుగు సినిమాలకి తమిళనాట ఆదరణ లభించదు.

అయితే ‘పుష్ప 2’కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే టాక్ మాత్రం మిశ్రమంగా వచ్చిందంట. సినిమాలో కథ, కథనాలు ప్రేక్షకులని పెద్దగా ఎంగేజ్ చేయలేదనే మాట వినిపిస్తోంది. బలమైన కథ లేకపోవడం ఈ సినిమాకి కొంత మైనస్ అయ్యిందని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది ప్యూర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనే మాట పబ్లిక్ నుంచి వినిపిస్తోంది.

మెజారిటీ ఆడియన్స్ మాత్రం అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ని ఆశ్వాదించారు. అలాగే ఇలాంటి యాక్షన్ బేస్డ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడేవారి నుంచి తమిళనాడులో సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మిశ్రమ టాక్ లభించినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ మేరకు అక్కడి ఆడియన్స్ ని థియేటర్స్ వరకు రప్పించగలదు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వీకెండ్ ఉంది కాబట్టి కచ్చితంగా పబ్లిక్ రెస్పాన్స్ సాలిడ్ గా ఉండొచ్చని అనుకుంటున్నారు. సోమవారం నుంచి ఈ సినిమాకి వచ్చే పాజిటివ్ టాక్ బట్టి కలెక్షన్స్ స్పీడ్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కేరళలో కూడా బన్నీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అందుకే ‘పుష్ప 2’కి అక్కడ మంచి రెస్పాన్స్ వస్తోంది. చూస్తుంటే బన్నీ ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్స్ అందుకోబోతున్నట్లు అర్ధమవుతుంది.

Tags:    

Similar News