దేవర 2.. ఓ ప్లాన్ సెట్టయ్యింది

‘దేవర’ సినిమాకి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ‘దేవర 2’ పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

Update: 2024-10-06 04:08 GMT

‘దేవర’ సినిమాకి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ‘దేవర 2’ పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. మొదటి పార్ట్ లో విడిచిపెట్టిన చాలా ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమ తన ఇంటర్వ్యూలో ‘దేవర 2’ మూవీ ఎప్పుడు రావొచ్చు అని ప్రశ్నించారు. దీనిపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. ‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ అన్ని అయిపోయాక ఆ ప్రపంచం నుంచి ఓ రెండు నెలలు బయటకొచ్చి ఫ్యామిలీ తో వెకేషన్ కి వెళ్ళమని కొరటాలకి చెప్పాను.

అస్సలు ‘దేవర 2’ గురించి ఆలోచించొద్దు అన్నాను. ఇద్దరం కలవకూడదని కూడా డిసైడ్ అయ్యాను. తరువాత డిసెంబర్ నుంచి మరల స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. కథ అయితే ఆల్ మోస్ట్ ఫైనల్ అయిపొయింది. కాకపోతే ఇంకా డెవలప్మెంట్స్ ఏవైనా ఉంటే వాటిని చేసుకొని వెళ్తారని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. నేను ముంబై వెళ్లి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాను అని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో చెప్పారు. కొరటాల మాట్లాడుతూ తనకి చిన్న చిన్న కోరికలు ఉన్నాయని.. ఏపీ వెళ్లి అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని పర్టిక్యులర్ థియేటర్స్ లో దేవర మూవీ చూడాలని అనుకుంటున్నట్లు ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఈ కోరికలు తీర్చుకున్న తర్వాత ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. తర్వాత వచ్చి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానని కొరటాల స్పష్టం చేశారు. ఆడియన్స్ ఫీడ్ బ్యాక్, ఒపీనియన్స్ ని దృష్టిలో ఉంచుకొని కథనంలో ఇంకా ఎవరైనా మిస్ అయిన ఎలిమెంట్స్ ఉంటే వర్క్ చేయాలని తెలిపారు. ‘దేవర పార్ట్ 2’ కి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించడం జరిగిందని ఇంటర్వ్యూలో కొరటాల తెలియజేశారు.

కొరటాల స్క్రిప్ట్ డెవలప్ మెంట్ వర్క్ కంప్లీట్ చేసేస్తే తరువాత ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. అంటే ఆల్ మోస్ట్ వచ్చే ఏడాదిలోనే మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ షెడ్యూల్ బట్టి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారనేది వచ్చే ఏడాదిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఇక మూవీ సక్సెస్ మీట్ లు నిజానికి అవుట్ డోర్ లోనే పెట్టాలని అనుకున్నామని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.

అయితే దేవినవరాత్రులు ఉండటం వలన అవుట్ డోర్ ఈవెంట్ కష్టం అవుతుందని చెప్పారు. ఇండోర్ లో పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఫేస్ చేసాం. అందుకే రిస్క్ తీసుకోవాలని అనుకోలేదని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. నిజానికి జాన్వీ కపూర్ కూడా డైరెక్ట్ గా పబ్లిక్ తో కలవాలని చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేస్తుంది. తాను తెలుగమ్మాయిగా ఫీల్ అవుతుంది. కాకపోతే ఆమె కోరిక నెరవేరలేదు అని కొరటాల చెప్పారు.

Tags:    

Similar News