కొరటాల శివ రెండేళ్లు వెయిటింగ్ తప్పదా..?

ఎన్టీఆర్ తో దేవర మొదటి భాగం చేసిన కొరటాల శివ ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ఇచ్చాడు. ఐతే ప్రస్తుతం దేవర 2 ని ఇంకాస్త బెటర్ గా చేసేందుకు వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.

Update: 2025-02-19 12:30 GMT

ఎన్టీఆర్ తో దేవర మొదటి భాగం చేసిన కొరటాల శివ ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ఇచ్చాడు. ఐతే ప్రస్తుతం దేవర 2 ని ఇంకాస్త బెటర్ గా చేసేందుకు వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. దేవర 2 అసలైతే ఈ ఇయర్ మొదలవుతుందని అనుకోగా అది కాస్త మరో రెండేళ్లు వెనక్కి వెళ్లేలా ఉందని లేటెస్ట్ టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నాడు హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తారక్ ఆ సినిమాతో మరోసారి పాన్ ఇండియా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.

ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమా మొదలు కాబోతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపటి  నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఐతే ఈ సినిమా కోసం భారీ సెటప్ అంతా సిద్ధం చేశాడు నీల్. కె.జి.ఎఫ్, సలార్ 1 తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఐతే వాటికి ఏమాత్రం తక్కువ కాకుండా సినిమా ఉండేలా చేస్తున్నారట.

ఐతే ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎలా లేదన్నా రెండేళ్లు టైం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. 2025 నుంచి 2026 సెకండ్ హాఫ్ వరకు నీల్ సినిమాకే ఎన్ టీ ఆర్ డేట్స్ ఇచ్చేస్తున్నాడట. 2026 చివర్లో దేవర 2 ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో అప్పుడు మొదలు పెట్టినా కూడా దేవర 2 సినిమా 2027 లేదా 2028 దాకా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. స్టార్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ వల్ల ఒక సినిమాను రెండు మూడేళ్లు తీయడం చాలా కామన్ అయ్యింది.

వార్ 2 ఈ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ అవుతుండగా ఎన్ టీ ఆర్ ప్రశాంత్ నీల్ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ కల్లా పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఇక దేవర 2 ఐతే 2028 దాకా వెళ్తుందని తెలుస్తుంది. దేవర 1 లో చిక్కుముడులు అన్నిటికీ పార్ట్ 2 లో సమాధానం దొరుకుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఐతే ఆ సస్పెన్స్ ఇంకా 3 ఏళ్ల దాకా వెయిట్ చేయక తప్పట్లేదు. కొరటాల శివ మాత్రం ఈ రెండేళ్లు దేవర 2 మీదే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News