దేవర 2 మడత పెట్టేందుకు సిద్ధమా..?

పాత్రలు అనుకున్న దానికన్నా బలంగా రావడం వల్ల దేవర ని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

Update: 2024-09-27 05:25 GMT

ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 నేడు రిలీజ్ అవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా ఫైనల్ టాక్ ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. ఐతే ఎన్టీఆర్ డ్యుయల్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. ఐతే దేవర పార్ట్ 1 ను ముగిస్తూ పార్ట్ 2 కి మంచి లీడ్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఐతే దేవర అసలు ఎందుకు రెండు భాగాలు చేయాల్సి వచ్చిందో ఇదివరకు కొరటాల శివ ఇంటర్వ్యూలో చెప్పారు. పాత్రలు అనుకున్న దానికన్నా బలంగా రావడం వల్ల దేవర ని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

ఐతే దేవర పార్ట్ 1 షూట్ చేసే టైం లోనే పార్ట్ 2 కి సంబంధించిన కొన్ని షాట్స్ తీసి పెట్టుకున్నామని అన్నారు కొరటాల శివ. అంతేకాదు పార్ట్ 1 పూర్తైంది కాబట్టి పార్ట్ 2 ని చాలా త్వరగా పూర్తి చేస్తానని అన్నారు. దేవర పార్ట్ 1 రిలీజ్ హడావిడి అయ్యాక తారక్ తో కూర్చుని దేవర పార్ట్ 2 ఎప్పుడు పూర్తి చేయాలన్నది నిర్ణయిస్తామని అన్నారు. ఐతే ఇప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ తో అయితే 6 నుంచి 8 నెలల్లో దేవర పార్ట్ 2 పూర్తి చేస్తానని అంటున్నారు కొరటాల శివ.

ఐతే దేవర పార్ట్ 1 రిజల్ట్ చూసి సినిమాకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ని సమీక్షించుకుని దేవర పార్ట్ 2 చేస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 లో భాగం అవుతున్నాడు. జనవరి నుంచి ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. ఐతే ఈలోగా కొరటాల శివ దేవర పార్ట్ 2 సెటప్ అంతా రెడీ చేస్తే ఎన్టీఆర్ వచ్చి షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది.

దేవర 1 అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు డే వన్ రికార్డుల మీద తారక్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఎన్టీఆర్ స్టామినా ఏంటన్నది బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ చేసేలా దేవర 1 వసూళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఐతే నైట్ ప్రీమియర్స్ నుంచి వస్తున్న టాక్ ను బట్టి కలెక్షన్స్ ఆశించిన స్థాయి తెస్తుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News