కోట బొమ్మాళి.. పొలిటికల్ టచ్ గట్టిగానే..

ఇప్పటికే మాస్ ఆడియోన్స్ ఆకట్టుకునే విధంగా లింగిడి పాట ఒకటి ప్రేక్షకుల ముందు వచ్చింది. ఆ పాట ఇప్పుడు మాస్ ఏరియాలలో ఎక్కువగా వినిపిస్తోంది.

Update: 2023-11-18 05:21 GMT

పొలిటికల్ నేపథ్యంలో సినిమాలు వచ్చి చాలా కాలం అయింది. అలాగే పోలీస్ నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలు అయితే రాలేదు. ఇప్పుడు ఆ రెండు అంశాలను కలగలిగిన కోట బొమ్మాళి అనే సినిమా రాబోతోంది. ఇందులో ప్రస్తుతం రాజకీయ అంశాల గురించి మాత్రమే కాకుండా పోలీసులు వ్యవస్థలను కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

రాజకీయ వ్యక్తుల కారణంగా న్యాయంగా పనిచేసే పోలీసులు అధికారులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? సాధారణ జనాలు ఓట్ల మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు అనే విషయాలను సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒకవైపు తెలంగాణ మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సమయంలో కోటబొమ్మాలి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా హడావిడిగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుత అంశాలను హైలైట్ చేస్తూనే ప్రమోషన్ లో అద్భుతమైన కంటెంట్ వదులుతూ ఉన్నారు. ఇప్పటికే మాస్ ఆడియోన్స్ ఆకట్టుకునే విధంగా లింగిడి పాట ఒకటి ప్రేక్షకుల ముందు వచ్చింది. ఆ పాట ఇప్పుడు మాస్ ఏరియాలలో ఎక్కువగా వినిపిస్తోంది.

ఇక కోటబొమ్మాలి సినిమా నుంచి ఇటీవల టైటిల్ సాంగ్ కూడా వచ్చింది. ఇందులో ప్రస్తుతం రాజకీయ అంశాలను హైలైట్ చేస్తూ కొన్ని సన్నివేశాలకు కూడా చూపించారు. అలాగే కులం అనే పాయింట్ కూడా టచ్ చేశారు ఓటు హక్కు పై జనాలకు క్లారిటీ వచ్చే విధంగా ఇందులో సన్నివేశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా సినిమా ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అని కూడా చిత్ర యూనిట్ చెబుతోంది.

GA2 పిక్చర్స్ నిర్మించిన కోట బొమ్మాళి PS లో శ్రీకాంత్ మేకా, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోట బొమ్మాళి PS వ్యవస్థ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోవాలని పెద్ద ఎత్తున ప్రేక్షకులు రాజకీయ వర్గానికి చెందిన ఒక వర్గం ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తోంది. జోహార్ మరియు అర్జున ఫాల్గుణ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని లింగి లింగి లింగిడి పాట అద్భుతమైన హిట్ గా నిలిచింది. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Full View
Tags:    

Similar News