నా గురువు త్రివిక్రమ్ గారి వల్లే ఇది సాధ్యమైంది: GOG డైరెక్టర్ కృష్ణ చైతన్య
కారణజన్ముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది.
విశ్వక్సేన్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ మూవీ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా ఈ నెల 31న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సినిమా వేడుకలో దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, "ముందుగా నందమూరి బాలకృష్ణ గారు ఈవెంట్‌కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కారణజన్ముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది.
ఏడాది క్రితం ఇదే రోజున సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేశాం 'జోహార్ ఎన్టీఆర్' అని. ఆ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఏడాది తర్వాత ఇదే రోజు ఈ వేడుక జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాంటి స్పందన అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గురువు త్రివిక్రమ్ గారు సపోర్ట్ చేయడం వల్లే ఇక్కడి వరకు వచ్చాను. ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే నిర్మాత సూర్యదేవర వంశీ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. చిన బాబు గారు కూడా మాతో స్క్రిప్ట్ దగ్గర నుంచి కూర్చుని కరెక్షన్స్ లలో సహకరించారు. ఆయనకు కూడా థాంక్స్ చెబుతున్నాను. అలాగే ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్సేన్ అలాగే మిగతా నటీనటులు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు.
నా టీం, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డి.ఓ.పి., ఎడిటర్ కూడా ఎంతో బాగా వర్క్ చేశారు. వారు లేనిదే నేను ఈ సినిమాను మీ ముందుకు ఇంత గ్రాండ్‌గా తీసుకురాలేను. అలాగే డాన్స్ మాస్టర్స్, సాంగ్స్ రచయితలు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు. హీరోయిన్స్ నేహా శెట్టి, అంజలి ఇద్దరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారు.
రత్నమాలగా అంజలి చేసిన పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక నా బ్రదర్ విశ్వక్సేన్ గురించి నేను ఎక్కువగా పొగడలేను, కానీ లంకల రత్న అనే క్యారెక్టర్ అతను బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భయపెడుతుంది. ఈ వేడుకకు వచ్చిన బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఈ సినిమాకు ఎంతో బాగా వర్క్ చేశారు. ఇప్పటికీ కూడా వారు వర్క్ చేస్తూనే ఉన్నారు..ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని నమ్మకంతో చెబుతున్నాను.. అని కృష్ణ చైతన్య తన స్పీచ్ ముగించారు.