శాస్త్రిగారిచే పబ్ లోనే పాట రాయించిన డైరెక్టర్!
పాటల రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సేవలు చిరస్మర ణీయం.
పాటల రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సేవలు చిరస్మర ణీయం. ఎన్నో గొప్ప పాటలు రచించిన రచయితగా పరిశ్రమ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసిపెట్టి వెళ్లారు. సాహిత్యంతో ఎన్నో పాటలకు ప్రాణం పొసిన ఓ లెజెండ్. ఎంతో మంది దర్శకులతో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ప్రత్యకంగా సిరివెన్నెల- కృష్షవంశీ మధ్య గురుశిష్యుల బంధం.
కృష్ణవంశీ తెరకెక్కించిన చాలా సినిమాలకు శాస్త్రిగారే పాటలు రచించారు. ఎన్నో ఆణిముత్యాలు ఈ కాంబినేషన్ లో సాధ్యమయ్యాయి. అందుకే సిరివెన్నెల మరణానంతరం తాను అనాధనైపోయానంటూ కృష్ణవంశీ భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఇటీవల సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు పాల్గొని శాస్త్రి గారిచే తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంలో మరోసారి కృష్ణవంశీ శాస్త్రి గురించి మరో ఆసక్తికర విషయం రివీల్ చేసారు. ` నేను తెరకెక్కించిన `ఖడ్గం` సినిమాలో `ముసుగు వేయోద్దు మనసు `మీద రాయాల్సివచ్చినప్పడు ఆ పాట ఎలా రాయోలో శాస్త్రి గారికి అర్దం కాలేదు. అది పబ్ సాంగ్ అని చెప్పి రాయమన్నా. కానీ ఆయనకి పబ్ లు ఎలా ఉంటాయో తెలియదు. దీంతో రాయడం కష్టమనేసారు. దీంతో ఆయన్ని నేరుగా పబ్ కి తీసుకెళ్లి అక్కడే రాయించాను.
పబ్ వాతావరణం చూసి అక్కడికక్కడే ముసుగు వేయోద్దు పాట రాసిచ్చారు. నేను షాక్ అయ్యాను. పాట రాయడానికి సమయం తీసుకుంటారనుకున్నా. కానీ అక్కడి వెదర్ ని ఇట్టే పసిగట్టి రాసిచ్చారు` అని అన్నారు. అలాగే ఎన్నో విప్లవాత్మక చిత్రాలకు చాలా వేగంగా పాటలు రాసిచ్చిన ఘనత శాస్త్రి గారి సొంతం. ఇలాంటి మజిలీలు ఎన్నో శాస్త్రి గారి ప్రయాణంలో ఉంటాయి.