2025 అయినా కలిసొచ్చేనా?
అప్పటి వరకూ ఉత్సాహంగా టాలీవుడ్ సినిమాలు చేసిన అమ్మడు ఒక్కసారిగా దూరమైంది.
సెలబ్రిటీలంతా కోటి ఆశలతో కొత్త ఏడాదికిలోకి అడుగు పెట్టేసారు. దీంతో 2025లోనైనా అనుకున్న లక్ష్యాలు చేధించాలని పట్టుదలతో కదులుతున్నారు. కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇందులో ముందున్న భామలెవరు? అంటే ప్రధానంగా ముగ్గురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారే కృతిశెట్టి, పూజాహెగ్డే, నిధీ అగర్వాల్. ముగ్గురు భామలు 2025 మంచి కంబ్యాక్ ఇయర్ గా భావిస్తున్నారు. `మనమే` తర్వాత కృతిశెట్టి తెలుగు తెరపై కనిపించలేదు.
అప్పటి వరకూ ఉత్సాహంగా టాలీవుడ్ సినిమాలు చేసిన అమ్మడు ఒక్కసారిగా దూరమైంది. వరుసగా కోలీవుడ్ చిత్రాలతోనే బిజీ అయింది. `ఏఆర్ ఎమ్` చిత్రంతో మాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా `ఉప్పెన` సక్సెస్ అనంతరం తిరుగులేని నాయికగా ఎదుగుతుందని భావించినా? అమ్మడి కెరీర్ ఇక్కడ ఆ విధంగా సాగలేదు. దీంతో సమయం వృద్దా చేయకుండా కోలీవుడ్ పై దృష్టి పెట్టి అక్కడ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు నటిస్తోన్న మూడు కోలీవుడ్ చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అవి ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ముంబై బ్యూటీ పూజాహెగ్డే రెండున్నరేళ్లగా తెలుగు సినిమాల్లో కనిపించని సంగతి తెలిసిందే. `ఆచార్య` తర్వాత బాలీవుడ్ లో బిజీ అవ్వడం? ఫెయిలవ్వడం అన్ని వేగంగా జరిగిపోయాయి. దీంతో టైమ్ వేస్ట్ కాకుండా వెంటనే సౌత్ లో కంబ్యాక్ ప్రయత్నాలు మొదలు పెట్టి కోలీవుడ్ లో ఛాన్సులు అందుకుంది. ప్రస్తుతం సూర్యతో `రెట్రో` సినిమా చేస్తోంది. దళపతి విజయ్ 69వ చిత్రంలోనూ ఛాన్స్ అందుకుంది. రెండు సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ అవుతున్నాయి.
అలాగే నిధీ అగర్వాల్ కూడా నిశీధిని దాటి బయటకు రావాలని రెండేళ్లగా ఎదురు చూస్తోంది. `హీరో` తర్వాత అమ్మడు నటించిన సినిమా అంటూ లేదు. చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ తో `హరిహర వీరమల్లు` సినిమా చేస్తోంది. కానీ ఆ సినిమా కి రిలీజ్ మోక్షం కలగడం లేదు. కానీ పవన్ బ్రాండ్ తో అమ్మడి పేరు ఈ రెండేళ్లు జనాల మధ్యలో బాగానే నలిగింది. ఆ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా ఇదే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. షూట్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో రిలీజ్ పై సందేహాలు అవసరం లేదు. ఈ సినిమా హిట్ అయితే నిధికి మంచి ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది.