ప్రియుడితో చిక్కిన‌ కృతిస‌నోన్!

శుక్రవారం రాత్రి ముంబైలో డిన్నర్ డేట్ లో వారిని ఉన్న‌ప్పుడు కెమెరాలు వెంబ‌డించాయి. ఆ ఇద్ద‌రూ పార్టీ నుంచి చెరో దారిన వెళుతూ దాగుడు మూత‌ల ఆట‌కు ప్ర‌య‌త్నించినా కానీ కెమెరాలు వ‌దిలిపెట్ట‌లేదు.

Update: 2025-02-09 12:30 GMT

విదేశాల్లో షికార్లు.. రాత్రి వేళల్లో ముంబై న‌గ‌రంలో ఔటింగులు.. ప‌బ్బు క్ల‌బ్బుల్లో పార్టీలు.. వ‌గైరా వగైరా ప్రేమ‌ప‌క్షుల‌కు చాలా రొటీన్‌. ఇప్పుడు అలాంటి రొటీన్ షికార్ల‌లో భాగంగా, చాటు మాటున క‌లుసుకుంటూ ఒక్కోసారి కెమెరా కంటికి చిక్కుతున్నారు కృతి-క‌బీర్ జంట‌. ఇటీవ‌ల ఓ నైట్ పార్టీలో ప్రియుడు క‌బీర్ బాహియాతో కృతి స‌నోన్ కనిపించింది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

శుక్రవారం రాత్రి ముంబైలో డిన్నర్ డేట్ లో వారిని ఉన్న‌ప్పుడు కెమెరాలు వెంబ‌డించాయి. ఆ ఇద్ద‌రూ పార్టీ నుంచి చెరో దారిన వెళుతూ దాగుడు మూత‌ల ఆట‌కు ప్ర‌య‌త్నించినా కానీ కెమెరాలు వ‌దిలిపెట్ట‌లేదు. అంతేకాదు పార్టీలో మీడియా త‌మ‌ను వెంబ‌డిస్తుంటే క‌బీర్ బాహియా త‌న ముఖాన్ని దాచుకోవడానికి ప్రయత్నించాడు.

కానీ చివరికి ఇద్దరూ ఒకే కారులోకి ఎక్కి దొరికిపోయారు. ఆ స‌మ‌యంలో కృతి సనన్ ఆల్ డెనిమ్ లుక్ లో క‌నిపించ‌గా, కబీర్ క్యాజువల్ టీ-షర్ట్, ప్యాంటు - స్వెట్‌షర్ట్ కాంబోలో కూల్‌గా క‌నిపించాడు.

ఈ అంద‌మైన జంట ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షికార్ చేస్తున్నాయి. జనవరిలో ఈ జంట‌ నూతన సంవత్సర వేడుకల్లో క‌లిసి క‌నిపించారు. రెడ్డిట్‌లో షేర్ చేసిన ఫోటోల్లో ఆ ఇద్ద‌రి సాన్నిహిత్యం ఆక‌ర్షించింది. కృతి సనన్ కబీర్ బహియా భుజంపై తల ఉంచి కనిపించింది. మరొక ఫోటోలో వారు రహత్ ఫతే అలీ ఖాన్- మెహ్విష్ హయత్ పాల్గొన్న కచేరీలో కూడా క‌నిపించింది.

ఈ అంద‌మైన‌ జంట ఇన్ఫినిటీ పూల్‌లో కలిసి సమయాన్ని ఆస్వాధిస్తున్న ఫోటో కూడా వైర‌ల్ గా మారింది. దీనికి ముందు కృతి సనన్ - కబీర్ బహియాతో కలిసి దుబాయ్‌లో క్రిస్మస్ సెల‌బ్రేష‌న్ చేస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. కృతి సోదరి నూపుర్ సనన్ .. ఎంఎస్‌ ధోని గ్యాంగ్ కూడా వారితో క‌లిసారు. మొత్తానికి ధోనీకి అత్యంత స‌న్నిహితుడైన క‌బీర్ బాహియాతో కృతి స్నేహం చ‌ర్చ‌గా మారింది.

కృతి సనన్ చివరిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'దో పట్టి'లో కనిపించింది. శశాంక చతుర్వేది రూపొందిస్తున్న ఈ చిత్రంలో కాజోల్ , షహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News