బిజినెస్‌మేన్‌తో యంగ్ హీరోయిన్ పెళ్లికి రెడీ?

శనివారం నాడు, కృతి - కబీర్ ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. కబీర్ తల్లిదండ్రులను కలవడానికి కృతి దిల్లీకి వెళ్లింద‌ని స‌మాచారం.

Update: 2025-02-17 22:30 GMT

దీపిక -ర‌ణ‌వీర్, అనుష్క శర్మ‌- విరాట్ కోహ్లీ, ఆథియా శెట్టి- కె.ఎల్.రాహుల్, .. పాపుల‌ర్ జంట‌లు పెళ్లి ముందు వ‌ర‌కూ చాలా విష‌యాల‌ను గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఇదే బాట‌లో కృతి స‌నోన్- క‌బీర్ బాహియా జంట డేటింగ్ వ్య‌వ‌హారాన్ని అధికారికంగా ప్ర‌క‌టించేందుకు దాప‌రికం పాటిస్తోంది. అస‌లు త‌మ మ‌ధ్య ఏమీ లేద‌ని కానీ, ఉంది అని కానీ బ‌య‌టికి చెప్ప‌డం లేదు.

ఇంత‌లోనే ముంబై మీడియా ఈ జంట పెళ్లికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని కొత్త పుకార్ ని పుట్టించింది. ఈ పుకార్ల మధ్య, కృతి సనన్ - కబీర్ బహియా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. వ్యాపారవేత్త కబీర్ బహియాతో ఏడాది కాలంగా కృతి డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ జంట అధికారికంగా ప్రకటించక‌పోయినా, విదేశీ విహారయాత్రలకు సంబంధించిన ఫోటోలు, వీడియో లీకులు దీనిని ధృవీక‌రించాయి.

శనివారం నాడు, కృతి - కబీర్ ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. కబీర్ తల్లిదండ్రులను కలవడానికి కృతి దిల్లీకి వెళ్లింద‌ని స‌మాచారం. దీంతో ఈ జంట పెళ్లితో ఒక‌ట‌య్యేందుకు వేళాయెను అంటూ మీడియా ప్ర‌చారం చేస్తోంది. ఒక‌ వీడియోలో ఈ జంట విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నట్లు కనిపించింది. అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ, కృతి తన ముఖాన్ని నల్లటి ముసుగుతో దాచే ప్ర‌య‌త్నం చేసింది. గత వారం కూడా కృతి సనన్ - కబీర్ బహియా ముంబైలో ఒక విందులో కనిపించారు.

ఈ అంద‌మైన జంట‌ రెస్టారెంట్ నుండి బయటకు వచ్చినప్పుడు కెమెరా కంట ప‌డ్డారు. కానీ ఇంత‌లోనే ఆ ఇద్ద‌రూ విడివిడిగా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డం కంట ప‌డింది. కృతి, క‌బీర్ చెరో దారిలో వెళుతూ కార్లు ఎక్కారు. గత సంవత్సరం కృతి సనన్ - కబీర్ బహియా దుబాయ్‌లో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఇద్ద‌రూ నైట్ పార్టీలో జోష్ ఫుల్ గా డ్యాన్సులు చేస్తూ క‌నిపించారు. కృతి సోదరి నూపుర్ సనన్ కూడా వేడుకలో పాల్గొన్నారు. క‌బీర్ కి ద‌గ్గ‌ర బంధువైన‌ ఎంఎస్ ధోని కూడా వారితో డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కృతి సనన్ చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ దో పట్టిలో కనిపించింది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజోల్, షహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. క‌రీనా, ట‌బుల‌తో క‌లిసి న‌టించిన `క్రూ` చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ విజయం అందుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News