ప్రచారం చేయడమంటే హీరోయిన్ కి అంత ఇబ్బందా!
వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న సమయంలో పూర్తయిన సినిమా ప్రచారం కోసం వేళ్లాలంటే నానా ఇబ్బంది పడిపోతుందట.
లేడీ సూపర్ స్టార్ నయనతార కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుంది. కానీ సినిమా ప్రచారానికి రమ్మంటే మాత్రం రాదు. కెరీర్ ఆరంభంలో ప్రచారానికి వచ్చేది. కాలక్రమంలో స్టార్ హీరోయిన్ గా మారడంతో తన డైరీలో కొత్త కండీషన్లు రాసుకుంది. అందులో ప్రచారానికి కూడా ఢుమ్మా కొట్టాలని కూడా ఉంది. ఇప్పటికీ ఆ నిబంధన పాటిస్తుంది. ప్రచారం కోసం ప్రత్యేకంగా ప్యాకేజీ ఇస్తామన్నా కూడా అమ్మడు రాదు. ఇది కూడా తాను రాసుకున్న కండీషన్ లో భాగమే. ఇండియాలోనే ఇలాంటి కండీషన్లు ఏ భామ విధించుకోదు. ఆరకంగా నయనతార జర్నీ సాగిస్తుంది.
తాజాగా కృతిసనన్ అలియాస్ సీతమ్మకి కూడా సినిమా ప్రచారం చేయడం అంటే ఎక్కడలేని దుఖం తన్నుకొ చ్చేస్తుందట. వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న సమయంలో పూర్తయిన సినిమా ప్రచారం కోసం వేళ్లాలంటే నానా ఇబ్బంది పడిపోతుందట. ప్రత్యక్షంగా` భేడియా` సినిమా ప్రమోషన్ కోసం పడిన ఇబ్బందిని గుర్తు చేసుకుంది. ఇతర సినిమాల షూటింగ్ తో పాటు భేడియా ప్రచారంలో పాల్గొనడం ఓ నరకంలా ఉందంది. వరుస ఇంటర్వ్యూలు, టీవీ సోలు, ప్రెస్ మీట్లలో పాల్గొందిట.
రాత్రంతా ప్రయాణం..పగలంతా ప్రచారంతో అలసట పడిన సంద్భాలెన్నో అంది. చివరికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కూడా ఇబ్బందిగా మారిందట. ఆ సమయంలో టేప్ రికార్డర్ ఉంటే ప్రతీ ప్రశ్నకు డయల్ చేయగానే సమాధానం దానంతటదే చెప్పేలా ఉంటే బాగుండనిపించిందట. ఓరియాల్టీ షోలో పాల్గొన్న సమయంలో ఏకంగా కంట కన్నీరే వచ్చేసిందట. ప్రచారమనే కాదు కొన్ని సందర్భాల్లో అవార్డు ఫంక్షన్లకు కూడా వెళ్లాలని పించదని తెలిపింది.
ఫోటో షూట్లో పాల్గొనాలని లేదని తన స్టైలిష్ కి చెబితే అప్పుడు ఆ బట్టలన్నీ మీరే కొనాలని చెప్పిందట. దీంతో ఆ సమయంలో తప్పక ఫోటో షూట్లు కూడా చేయాల్సి వస్తోందని తెలిపింది. మొత్తానికి అమ్మడు షూటింగ్ లో చూపించినంత ఉత్సాహం ప్రచారం సమయంలో చూపించదని ఈ సందర్భంగా తేలిపోయింది.