భర్త కోసం ప్రేమతో చేసిన స్వీట్!
పుల్కిత్ సామ్రాట్-కృతి కర్బందా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. కోడలి హోదాలో కృతి కర్భందా అత్తగారింట్లో అడుగు పెట్టింది
పుల్కిత్ సామ్రాట్-కృతి కర్బందా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. కోడలి హోదాలో కృతి కర్భందా అత్తగారింట్లో అడుగు పెట్టింది. ప్రస్తుతం కొత్త పెళ్లి కూతురు అత్తింటి ప్రేమానురాగాల్లో మునిగి తేలుతేంది. వెళ్లి వెళ్లగానే ఫ్యామిలీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకే కార్యక్రమాలు మొదలు పెట్టేసింది. పుల్కిత్ అమ్మమ్మతో ప్రేమతో మొలుగుతోన్న ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.
అందులో అమ్మమ్మతో ఆప్యాయంగా దిగిన ఫోటోని చూస్తుంటే కృతి ఆకుటుంబంలో కలిసి పోవడానికి ఎంతో సమయం పట్టదని పిస్తుంది. ఇక అత్తింటి వారి కోసం అప్పుడే వంటల కార్యక్రమం కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇష్టమైన వంటకాలు అన్నింటిని వండి వడ్డించడం మొదలు పెట్టింది. ముఖ్యంగా కృతి కర్బాందా ఓ స్పెషల్ స్వీట్ చేయడం చేయితిరిగిన వంటగత్తె. భర్త కోసం ఆ స్వీట్ ని ఎంతో స్పెషల్ గా చేసినట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఆ స్వీట్ ఏంటి అంటే? దాని పేరు ఫలే రసోయి హల్వా. అమ్మడు ఒక్క స్వీట్ తయారీతో నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఆ స్వీట్ ని కుటుంబ సభ్యులంతా టేస్ట్ చేసి సూపరనేసారు. ఇక కొత్త పెళ్లి కూతురు అంతే అందంగానూ ముస్తాబైంది. మెరూన్ కలర్ ఎథ్నిక్ వేర్ లో తళతళ లాడిపోతుంది. సింపుల్ మ్యాకప్ లో కనిపిస్తుంది. మెడలో మంగళ సూత్రం అలాగే ఉంది.
ఇప్పటి సెలబ్రిటీ పెళ్లి కూతుళ్లు పెళ్లైన వెంటనే మంగళ సూత్రం మెడ నుంచి తొలగిస్తున్న వైనం చూస్తూ నే ఉన్నాం. కానీ కృతి కర్భందా మాత్రం ఇంకా ఆ ఛాన్స్ తీసుకోలేదు. అలాగే పుల్కిత్- కృతి పెళ్లి దుస్తుల్లో ఉన్న మరో ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక కృతి కర్బందా కి పెద్దగా సినిమా రెండేళ్లగా అవకాశాలు కూడా రావడం లేదు. ప్రస్తుతం `రిస్కీ రోమియో `అనే సినిమాలో నటిస్తోంది. చేతిలో ఉన్నది ఈ ఒక్క సినిమానే.