తీన్‌మార్ బ్యూటీ పెళ్లి త‌ర్వాత ట్రీట్

ఇటీవ‌ల త‌న హ‌బ్బీతో విహార యాత్ర‌లో ఉన్న కృతి ఇప్పుడు సోలోగా ఉన్న ఓ ఫోటోషూట్ ని షేర్ చేసింది.

Update: 2024-08-05 17:50 GMT

 కృతి ఖర్బందా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న తీన్ మార్, సుమంత్ స‌ర‌స‌న బోణి వంటి చిత్రాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత హిందీ చిత్ర‌సీమ‌లోను ప‌లు చిత్రాల్లో న‌టిగా వెలిగింది.

కానీ ఈ భామకు ఆశించిన స్టార్ డ‌మ్ ద‌క్క‌లేదు. అయితే చాలా కాలం పాటు న‌టుడు పుల్కిత్ సామ్రాట్ తో కృతి ప్రేమాయ‌ణం సాగించి చివ‌రికి పెళ్లాడింది.

 

ఇటీవల తన భర్త పుల్కిత్ సామ్రాట్‌పై తన ప్రేమను వ్య‌క్త‌ప‌రుస్తూ కవిత‌లు కూడా రాసింది. త‌న భ‌ర్త‌ను పొగిడేస్తూ ఒక అంద‌మైన క‌విత‌ను రాసింది. ఈ సంవత్సరం మార్చిలో ఢిల్లీ NCR - ITC గ్రాండ్ భారత్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు. భారతదేశం అంతటా రుచికరమైన వంటకాలను కలిగి ఉన్న ప్రత్యేకంగా క్యూరేటెడ్ మెనూతో అతిథులకు ట్రీటిచ్చారు. వారు గతంలో చాలా సంవత్సరాలు డేటింగ్ చేశారు. ఫుక్రే 3లో అద్భుత న‌ట‌నతో గుర్తింపు పొందిన పుల్కిత్ గతంలో శ్వేతా రోహిరాను వివాహం చేసుకున్నాడు. కానీ అది బ్రేక‌ప్ అయ్యాక కృతితో డేటింగ్ స్టార్ట్ చేసి వివాహం చేసుకున్నాడు.

 

ఇటీవ‌ల త‌న హ‌బ్బీతో విహార యాత్ర‌లో ఉన్న కృతి ఇప్పుడు సోలోగా ఉన్న ఓ ఫోటోషూట్ ని షేర్ చేసింది. సూర్య కాంతిలో శ‌రీరాన్ని రీట్రీట్ చేస్తూ క‌నిపించిన కృతి దీనికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది. సూర్య కాంతి.. లిటిల్ పింక్ తో ఏదైనా సాధ్య‌మే.. అంటూ వీటికి అంద‌మైన క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది.

 

సన్నీ సింగ్‌తో కలిసి 'రిస్కీ రోమియో' అనే చిత్రంలో కృతి న‌టించింది. క‌థానాయిక‌గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కృతి తన అభిమానులు, సహచరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. అభిరుచి మేర‌కు న‌టిగా కెరీర్ సాగించి వ్య‌క్తిగ‌తంగా, వృత్తిపరంగా తనను తీర్చిదిద్దుకున్నందుకు సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.

Tags:    

Similar News