సీతమ్మ ఖాతాలో మరో ప్రోపర్టీ!
అంతకు ముందు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుని గ్రేట్ పెర్పార్మర్ గా నిరాజనాలు అందుకుంది.
బాలీవుడ్ లో కృతి సనన్ టైమ్ ఇప్పుడు మామూలుగా నడవడం లేదు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'.. ' క్రూ' లాంటి సినిమాలతో వరుసగా సక్సస్ లు అందుకుంది. అంతకు ముందు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుని గ్రేట్ పెర్పార్మర్ గా నిరాజనాలు అందుకుంది. ఇలా అన్ని రకాలుగా అమ్మడికి 2024 బాగా కలసొస్తుంది.
కలిసొచ్చే వేళ అన్ని కలిసొస్తాయన్నట్లు ఆస్తులు సైతం బాగానే కూడబెడుతుంది. గత ఏడాది 35 కోట్లకు ఖరీదైన బంగళా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ముంబై లో మరో రెండు ప్లాట్ లను కూడా కొనుగోలు చేసింది. తాజాగా అమ్మడు అలీబాగ్‌లో మరో ప్రోపర్టీని కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలీబాగ్ లో రెండు కోట్లకు పైగా పెట్టుండి పెట్టినట్లు తెలుస్తోంది.
రెండు కోట్లకు పైగా ఖరీదు చేసే 2,000 చదరపు అడుగుల ప్రీమియం ప్లాట్‌ను కొనుగోలు చేసింది. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ప్రాజెక్ట్‌లో భాగమైన ప్లాట్ ఇది. దీని చుట్టూ విస్తారమైన గ్రీనరీ ఉంది. అయితే ఇది బిగ్ బీ అమితాబచ్చన్ స్థలాన్ని ఆనుకుని ఉండటం మరో విషయం. ఈ ఏప్రిల్ లోనే అమితాబ్ 10,000 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసారు. ఆ సైట్ ని అనుకునే కృతిసనన్ స్థలం ఉండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది.
`నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. అభినందన్ లోధా అందమైన అభివృద్ధికి పేరు. అక్కడ నేను భూ యజమాని అయ్యాను. కొంతకాలంగా అక్కడ సైట్ కొనాలనుకుంటున్నాను. అది ఇప్పటికీ సాధ్యమైంది. ఇది నా సాధికారతగా చెప్పుకుంటాను. నేను పెట్టిన గొప్ప ఇన్వెస్ట్ మెంట్ గా భావిస్తున్నాను. సరైన సమ యంలో మంచి నిర్ణయంతో కొనుగోలు చేసానని` సంతోషం వ్యక్తం చేసింది.
క్రూ మరియు తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియాతో వరుసగా రెండు విడుదలలలో విజయం సాధించిన తర్వాత, నటి దో పట్టిలో తదుపరి పాత్రలో కనిపించనుంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం కనికా ధిల్లాన్ యొక్క కథా పిక్చర్స్ మరియు కృతి సనన్ యొక్క బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ యొక్క తొలి నిర్మాణం.