ఫారిన్ బ్యూటీలా మురిపిస్తోన్న సీతమ్మ!
భామల మధ్య పోటీని తట్టుకుని నిలబడాలంటే? ఎలివేషన్ పరంగా ఎంతో చేయాల్సి ఉంటుంది.
గ్లామర్ వరల్డ్ లో అందాల భామల మధ్య పోటీ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎవరైనా నిత్య నూతనంగా కనిపించాల్సిందే. అందులోనూ తాము సంథింగ్ స్పెషల్ అనిపించాలి. నలుగురి దారిలో వెళ్లడం కాదు. నలుగురు మన దారిలో నడిచేలా చేసినప్పుడే సక్సెస్ అవుతాం. భామల మధ్య పోటీని తట్టుకుని నిలబడాలంటే? ఎలివేషన్ పరంగా ఎంతో చేయాల్సి ఉంటుంది.
ఆ విషయంలో కృతిసనన్ అలియాస్ సీతమ్మ ఏమాత్రం తగ్గదు. సక్సెస్ క్రేజ్ని తెలివిగా రెట్టింపు చేసు కుంటుంది. ఫ్యాషన్ వరల్డ్ లో తానో బ్రాండ్ అని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసింది. డిఫరెంట్ డిజైనర్ కాస్ట్యూమ్స్ లో కృతికి పోటీ ఉంటుందా? అనిపించింది. తాజాగా అమ్మడు మరోసారి నెటి జనుల దృష్టిని ఆకర్షించే లుక్ తో వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా ఏకంగా విదేశీ మోడల్స్ నే తలపించింది.
అమ్మడు కటౌట్ కి తగ్గ దుస్తులు ధరించి అచ్చంగా ఫారిన్ బ్యూటీ ఫీల్ తీసుకొచ్చింది. నడుం దగ్గర నుంచి కాళ్ల వరకూ ధరించిన పీస్..మ్యాచింగ్ టాప్ లో ధరించిన స్కిన్ టైట్ బ్లౌజ్ లో మోడ్రన్ బ్యూటీలా హైలైట్ అవుతుంది. ఇక అమ్మడి హెయిర్ స్టైల్ అయితే ఏకంగా రష్యన్ బ్యూటీనే తలపిస్తుంది. గోల్డ్ కలర్ సిల్కీ హెయిర్ స్టైల్ లో వావ్ అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ ఎరుపు రంగు లొకేషన్ కృతిని మరింత ప్రకాశవంతంగా మలిచింది.
కాళ్లకు హైహీల్స్ ధరించి..రెండు చేతులు చాచి వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కృతిని ఇలాంటి ఫోజులో అభిమానులు ఇంతవరకూ చూడలేదు. దీంతో ఆ ఫోటో సంథింగ్ స్పెషల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే `ది క్రూ`తో అమ్మడు మరో సక్సస్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.