కమ్ముల 'కుబేర' సర్ ప్రైజ్.. ధనుష్ మాస్ విజిల్!

ఈ పోస్టర్ చూస్తుంటే శేఖర్ కమ్ముల తన రెగ్యులర్ కథల స్థాయిని దాటి, మాస్ ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది.;

Update: 2025-04-14 14:03 GMT
కమ్ముల కుబేర సర్ ప్రైజ్.. ధనుష్ మాస్ విజిల్!

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కుబేర’పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ మాస్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వరుసగా ఆసక్తికర ప్రమోషనల్ కంటెంట్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి.

 

ఇప్పుడు ఈ చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇదే ఫస్ట్ సింగిల్ పోస్టర్ కూడా. మ్యూజికల్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి పాటను ఏప్రిల్ 20న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. పాట ప్రోమో ఏప్రిల్ 19న రానుంది. ఈ పాట విడుదల సందర్భంగా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగించేందుకు ఈ పోస్టర్‌ వినూత్నంగా రూపొందించబడింది.

పోస్టర్ లో హీరో ధనుష్ మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ కేక పెట్టిస్తున్నాడు. ధనుష్ డాన్సింగ్ పోజ్‌తో ఉండగా, బ్యాక్‌డ్రాప్‌లో ముంబై లైట్‌డప్ వీధుల్లో ర్యాలీలా సాగుతున్న జాతర వాతావరణం చూపిస్తూ చిత్రీకరించారని అనిపిస్తోంది. ధనుష్ వేసిన కాస్ట్యూమ్, డ్యాన్స్ వాతావరణం, వెనుక వందలాది జనం సందడి చేస్తూ ఉండటం చూస్తే, ఇది ఫెస్టివల్ సాంగ్ అనిపిస్తోంది.

ఈ పోస్టర్ చూస్తుంటే శేఖర్ కమ్ముల తన రెగ్యులర్ కథల స్థాయిని దాటి, మాస్ ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకూ ‘ఆనంద్’, ‘ఫిదా’, ‘లీడర్’ లాంటి సినిమాలతో డిఫరెంట్ జానర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న శేఖర్ కమ్ముల ఈసారి అన్ని వర్గాల ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమా రూపొందిస్తున్నారని స్పష్టమవుతోంది.

ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడమే ఈ సినిమాకు మరో హైలైట్. ఆయన చేతిలో వచ్చిన మాస్ బీట్స్ తెలుగులోనే కాదు తమిళ, హిందీ మార్కెట్‌లోనూ హిట్ అయ్యేలా ఉంటాయి. ఇదే నమ్మకంతో మేకర్స్ ఈ ఫస్ట్ సింగిల్‌ను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పోస్టర్‌లో కనిపిస్తున్న గ్రాండ్ స్కేల్, లైట్ ఎఫెక్ట్స్, కలర్ టోన్ అన్నీ మేకింగ్ పరంగా బడ్జెట్‌ ఎంత ఖర్చు పెట్టారో తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే ‘కుబేరా’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. సినిమా జూన్ 20, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది.

Tags:    

Similar News