కుబేరకి అది చాలా కీలకం కాబోతుందా..?

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా కుబేర.;

Update: 2025-04-14 04:52 GMT
Dhanush Kubera key Important In DSP Music

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా కుబేర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ లో సునీల్ నారంగ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కుబేర రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

సినిమా షూటింగ్ కూడా శేఖర్ కమ్ముల ఎలాంటి హడావిడి లేకుండా చేస్తున్నారు. ధనుష్ సినిమా రిలీజ్ ముందు కన్నా రిలీజ్ తర్వాత చేసే హంగామా ఎక్కువ. తన వర్సటాలిటీతో ఆడియన్స్ ని మెప్పిస్తాడు. కుబేర సినిమాలో కూడా ధనుష్ తన పాత్రతో సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. ఐతే ఈ సినిమాలో తెర మీద నటీనటులతో పాటు తెర వెనక దేవి మ్యూజిక్ కూడా కీలకం కాబోతుందట.

దేవి శ్రీ ప్రసాద్ ఈమధ్య మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చాడు. పుష్ప 2 కి అతను ఇచ్చిన సాంగ్స్, బిజిఎం తెలిసిందే. ఐతే పుష్ప 2 ఒక మాస్ ఎంటర్టైనర్ కానీ కుబేర ఒక స్టోరీ టెల్లర్ అందుకే దేవి ఈ సినిమాకు కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నారని తెలుస్తుంది. సినిమాతో మరోసారి దేవి మార్క్ ఏంటో చూపిస్తాడని అంటున్నారు. కచ్చితంగా కుబేర మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ గా మారుతుందని టాక్.

ధనుష్, నాగార్జున, రష్మిక ఇలా స్టార్స్ అంతా కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఐతే సినిమా విషయంలో అప్డేట్స్ ఇవ్వడంలో మాత్రం మేకర్స్ వెనకబడి ఉన్నారు. ఐతే ఇదంతా వారి ప్లానింగ్ లో భాగమేనా లేదా నిజంగానే సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ మొదలు పెడతారా అన్నది చూడాలి.

కుబేర సినిమా చేస్తూనే మరోపక్క ధనుష్ తన సొంత డైరెక్షన్ లో చేస్తున్న ఇడ్లీ కొడై సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ రాయన్ తో అదరగొట్టిన ధనుష్ ఇడ్లీ కొడైతో కూడా తన మార్క్ చాటాలని చూస్తున్నాడు. కుబేర, ఇడ్లీ కొడై ఈ రెండు సినిమాలతో ఈ ఇయర్ ఫ్యాన్స్ ని అలరిచబోతున్నాడు ధనుష్. రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కాబట్టి తప్పకుండా ఆడియన్స్ లో కూడా ఈ సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Tags:    

Similar News