కుమారి శ్రీమతిగా నిత్యామేనన్.. ట్రైలర్ ఎలా ఉందంటే...

ఏ భాషలో నటించినా, తన సొంత డబ్బింగ్ చెప్పుకుంటుంది. అందుకే, ఆమె తొందరగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది. ఇప్పుడు, తాజాగా ఆమె కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2023-09-22 13:47 GMT

దక్షిణాదిన మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలో నిత్యామేనన్ మొదటి వరసలో ఉంటుంది. ఆమె నటనకు వంక పెట్టే పనేలేదు. ఎలాంటి పాత్ర అయినా, చాలా సులభంగా చేసేయగలదు. ఒక సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయగల సత్తా ఆమెలో ఉంది. ఇప్పటి వరకు నిత్యా మేనన్ తన నటనతో చాలా పాత్రలకు ప్రాణం పోశారు. ఆమె కారణంగానే సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఏ భాషలో నటించినా, తన సొంత డబ్బింగ్ చెప్పుకుంటుంది. అందుకే, ఆమె తొందరగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది. ఇప్పుడు, తాజాగా ఆమె కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి కాని వారిని సాధారణంగా కుమారి అని సంభోధిస్తారు. పెళ్లైన వారిని శ్రీమతి అని సంభోధిస్తారు. ఇందులో ఆమె పేరు శ్రీమతి, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి కుమారి శ్రీమతి. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.

ఆమె పేరు మీద కామెడీతోనే ట్రైలర్ మొదలైంది. తర్వాత ఆమెకు పెళ్లి చేయడానికి వాళ్ల అమ్మ తిప్పలు, ఎన్ని సంబంధాలు తెచ్చినా అంగీకరించదు. దాని వెనక ఒక కారణం. తాత కట్టించిన ఇంటిని తన సొంతం చేసుకోవాలనే కోరిక. దాని కోసం ఆమె ఏకంగా ఏ అమ్మాయి చేయని సాహసం చేసింది. ఊరిలో బారు పెట్టాలని అనుకుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన పరిస్థితులు ఏంటి? తన తాత ఇంటిని దక్కించుకుందా లేదో తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ట్రైలర్ చూస్తుంటే, సిరీస్ ఆకట్టుకుంటుందనే విషయం అర్థమౌతోంది. ఈ సిరీస్ లో కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు అదేనండి, నటుడు నిరుపమ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక, ఇటీవల మసూదతో హిట్ కొట్టిన హీరో కూడా నటిస్తున్నాడు. అలనాటి హీరోయిన్ గౌతమి తల్లి పాత్రలో నటించారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని ఇందులో చూపించనున్నారు. గోమటేశ్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా, నిత్యామేనన్ కి వెబ్ సిరీస్ లు కొత్తేమీ కాదు. గతంలో బ్రీత్, ఇన్ టు ద షాడోస్, మోడ్రన్ లవ్ హైదరాబాద్ లాంటి సిరీస్ లతో ఆకట్టుకుంది. హాట్ స్టార్ లో మరో వెబ్ సిరీస్ రావడానికి రెడీ అవుతోంది. మరి, ఈ కొత్త వెబ్ సీరీస్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News