విశాల్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన కుష్బూ

హీరో విశాల్ ఇటీవల జరిగిన 'మదగజరాజ' సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో విశాల్‌ లుక్‌ షాకింగ్‌గా ఉంది.

Update: 2025-01-08 06:12 GMT

హీరో విశాల్ ఇటీవల జరిగిన 'మదగజరాజ' సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో విశాల్‌ లుక్‌ షాకింగ్‌గా ఉంది. గతంతో పోల్చితే చాలా సన్నబడి కనిపించారు. అంతే కాకుండా మాట్లాడుతూ ఉన్న సమయంలో చేతులు వణకడం గమనించవచ్చు. అప్పటి నుంచి విశాల్‌ ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా పుకార్లు ప్రచారం చేస్తున్నారు. విశాల్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్నాడని వైద్యులు స్వయంగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం విశాల్‌ రికవరీ అవుతున్నారని ఆ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఐనా కొన్ని తమిళ మీడియా సంస్థలు విశాల్ ఆరోగ్యంపై ఇష్టానుసారంగా కథనాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులు మరోసారి ప్రకటన చేశారు.

తాజాగా కుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆమె విశాల్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. విశాల్‌ డెంగ్యూ, వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్నారు. అటువంటి సమయంలో మదగజరాజ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనేందుకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించిన సమయంలో కుష్బూ స్పందిస్తూ... 11 ఏళ్ల తర్వాత ఆ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. సినిమా ప్రమోషన్‌ కోసం తీవ్రమైన జ్వరం ఉన్నా విశాల్ ఆ ఈవెంట్‌కి హాజరు అయ్యాడు. ఈవెంట్‌ పూర్తి అయిన వెంటనే విశాల్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రస్తుతం చికిత్స పొందుతున్న విశాల్‌ త్వరలోనే కోలుకుంటారని వైద్యులు తెలియజేశారు.

డెంగ్యూ నుంచి బయట పడ్డ విశాల్‌ జ్వరంతో బాధ పడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెప్పారని కుష్బూ అన్నారు. 103 డిగ్రీల జ్వరం ఉన్నా సినిమాపై ప్రేమతో విశాల్‌ ఈవెంట్‌కి హాజరు అయ్యాడు అంది. విశాల్‌ ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రస్తుతం విశాల్‌ కోలుకుంటున్నాడు. అతి త్వరలోనే విశాల్‌ తిరిగి మీ ముందుకు వస్తాడు అంటూ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌ చెప్పింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్ లో ఈ సమయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపేయాలంటూ ఆమె పేర్కొంది. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆమె సున్నితంగా హెచ్చరించింది.

విశాల్‌తో తనకు చాలా కాలంగా సన్నిహిత పరిచయం ఉన్నట్లు కుష్బూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కలిసి నటించనున్న గతంలో ఒక పార్టీలో కలిసిన సమయంలో ఏర్పడిన పరిచయం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. ఇద్దరం తరచూ మాట్లాడుకుంటాం. విశాల్‌ సినిమాలంటే చాలా ఇష్టం అని కుష్బూ అన్నారు. హీరోల్లో అందరినీ మీరు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతాను, కానీ విశాల్‌ తో మాత్రమే తాను సరదాగా మాట్లాడుతాను. విశాల్‌ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా భవిష్యత్తులో విశాల్ సినిమాలో తాను నటిస్తాను అంటూ కుష్బూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News