వెంకీ మామ రికార్డ్‌కి చేరువైన సూపర్ స్టార్‌ మూవీ

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన ఎల్‌ 2 ఎంపురాన్‌ సినిమా ఒక వైపు వివాదాస్పదం అవుతూనే మరో వైపు భారీ వసూళ్లు రాబట్టింది.;

Update: 2025-04-08 11:05 GMT
వెంకీ మామ రికార్డ్‌కి చేరువైన సూపర్ స్టార్‌ మూవీ

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన ఎల్‌ 2 ఎంపురాన్‌ సినిమా ఒక వైపు వివాదాస్పదం అవుతూనే మరో వైపు భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రెండు రోజుల్లో రూ.100 కోట్లు రాబట్టిన ఈ సినిమా 9 రోజుల్లో రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు నమోదు చేసిన జాబితాలో ఇప్పటికే చేరింది. ఫిబ్రవరిలో విడుదలైన 'ఛావా' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి 2025 బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో సంక్రాంతికి విడుదల అయిన తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం వస్తున్నాం నిలిచింది.

వెంకటేష్‌, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.255 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. వెంకటేష్‌ భారీ వసూళ్లతో 2వ స్థానంలో ఉండగా 9 రోజుల్లోనే రూ.250 కోట్ల వసూళ్లను నమోదు చేసి మోహన్‌ లాల్ ప్రస్తుతం మూడో స్థానంలో నిలిచాడు. తక్కువ సమయంలోనే అత్యధిక వసూళ్లు నమోదు చేయడంతో పాటు, ఇంకా భారీగా వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే ఎల్‌ 2 సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్‌ను బ్రేక్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ రన్‌లో ఎల్‌ 2 సినిమా రూ.300 కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ మలయాళ సినీ వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

మోహన్‌ లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబోలో వచ్చిన 'లూసీఫర్‌' సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. పొలిటికల్ డ్రామాగా వచ్చిన లూసీఫర్‌ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేశారు. తెలుగులో సినిమాకు ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ హిట్ దక్కలేదు. అందుకే ఎల్‌ 2 సినిమాను రీమేక్‌ చేయడం కంటే డబ్‌ చేసి విడుదల చేయడం ఉత్తమం అనే అభిప్రాయంతో మేకర్స్‌ మలయాళంలో విడుదల అయిన సమయంలోనే తెలుగులోనూ రిలీజ్ చేశారు. మోహన్‌ లాల్‌ సినిమాలు వరుసగా ఫ్లాప్స్‌ అవుతూ ఉన్న సమయంలో ఎల్‌ 2 సినిమా ఆయన ఫ్యాన్స్‌కి జోష్‌ను తీసుకు వచ్చాయి అనడంలో సందేహం లేదు.

ఎల్‌ 2 సినిమాలో ఒక మతాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఒక మతానికి చెందిన వ్యక్తిని ఉగ్రవాదిగా చూపించారు అంటూ విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ఆ మతానికి చెందిన ఉగ్రవాది జాతీయ స్థాయిలో రాజకీయంగా కీలక పదవిలో ఉన్నాడు అంటూ సినిమాలో చూపించారు. దాంతో తీవ్ర స్థాయిలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌పై విమర్శలు వచ్చాయి. దాంతో సినిమాలో విలన్ పేరు మార్చడంతో పాటు, పలు సన్నివేశాల్లో మార్పులు చేర్పులు చేస్తూ, డైలాగ్స్‌ను మ్యూట్‌ చేస్తూ రీ సెన్సార్‌ చేయించారు. విడుదలైన కొన్ని రోజులకు మరోసారి సెన్సార్ ముందుకు వెళ్లిన ఘనత ఈ సినిమాకి దక్కింది. వివాదం కారణంగా వసూళ్లు ఎక్కువగా నమోదు అయ్యాయని కొందరు అంటున్నా, ఎల్‌ 2 సినిమాలో మంచి పొలిటికల్ కంటెంట్ ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News