లడ్డు గాని పెళ్లి.. మ్యాడ్ మాక్స్ మొదటి సాంగ్ ఎక్కేసిందిగా..!

ఈమధ్య కాలంలో ఒక సినిమా హిట్ అయితే చాలు వెంటనే సీక్వెల్ ప్రకటించి చేస్తున్నారు.

Update: 2024-09-20 07:22 GMT

ఈమధ్య కాలంలో ఒక సినిమా హిట్ అయితే చాలు వెంటనే సీక్వెల్ ప్రకటించి చేస్తున్నారు. ఈ సీక్వెల్ సినిమాల మీద ప్రేక్షకుల ఆసక్తి బాగుంది. అందుకే మేకర్స్ కూడా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ని క్యాష్ చేసుకునేందుకు హిట్ సినిమాలను సీక్వెల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో మ్యాడ్ ఒకటి. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో గౌరి ప్రియ, అనంతిక ఫిమేల్ లీడ్ గా నటించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించిన ఈ మ్యాడ్ సినిమా సీక్వెల్ చేస్తున్నారు మేకర్స్. ఈ సీక్వెల్ ని కూడా ప్రేక్షకులు ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యే కంటెంట్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. మ్యాడ్ మ్యాక్స్ నుంచి ఫస్ట్ సాంగ్ లడ్డు గాని పెళ్లి రిలీజైంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఇన్ స్టంట్ గా ఎక్కేసింది.

లడ్డు గాని పెళ్లి అంటూ సాంగే ఈ పాటని కాసర్ల శ్యాం రచించగా భీమ్స్, మంగ్లీ కలిసి ఆలపించారు. సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా ఆ జోరు మరింత పెంచేలా ఈ సాంగ్ ఫుల్ ఖుషి చేసింది. భీమ్స్ మార్క్ క్యాచీ ట్యూన్ తో అదరగొట్టాడు. తప్పకుండా మ్యాడ్ మ్యాక్స్ కూడా మరో సూపర్ హిట్ కొట్టేలా ఉందని చెప్పొచ్చు. మ్యాడ్ తర్వాత నార్నే నితిన్ ఆయ్ తో మరో హిట్ అందుకున్నాడు. సో మ్యాడ్ మ్యాక్స్ తో ఎన్ టీ ఆర్ బ్రదర్ ఇన్ లా హ్యాట్రిక్ హిట్ కొట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

మ్యాడ్ మ్యాక్స్ గా వస్తున్న మ్యాడ్ సీక్వెల్స్ అదే కథను కొనసాగిస్తారా లేదా కొత్త కథ తీసుకుంటారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఆ పాత్రల స్వభావాలు వారి టైమింగ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మ్యాడ్ మ్యాక్స్ కి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మ్యాడ్ మాక్స్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది అన్నది సినిమా వస్తేనే చెప్పగలం. నిర్మాత నాగ వంశీ మాత్రం ఈ సీక్వెల్ తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు.

Full View
Tags:    

Similar News