యూట్యూబ‌ర్‌పై సినిమా స్టైల్లో మ‌ర్డ‌ర్ ఎటెంప్ట్

ప్రముఖ యూట్యూబర్ లక్ష్య్‌ చౌద‌రి రష్యా నుండి ఢిల్లీకి తిరిగి వచ్చినప్పుడు తన ప్రత్యర్థులు అమన్ బిస్లా, హర్ష్ వికల్‌ సహా 8-10 మంది గూండాల బృందం తనను హత్య చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు.

Update: 2025-02-17 04:11 GMT

విమానాశ్ర‌యంలో వీఐపీ దిగి కార్ ఎక్క‌గానే, ఆ కార్ ని వెంబ‌డిస్తూ గూండాలు ఛేజ్ చేసే సీన్లు సినిమాల్లో చాలా చూసాం. కానీ ఇక్క‌డ అలాంటి సీన్ ని రియ‌ల్ గానే తాను ఎదుర్కొన్నాన‌ని త‌న‌ను కొంద‌రు వ్య‌క్తులు ఆయుధాల‌తో వెంబ‌డించార‌ని యూట్యూబ‌ర్ లక్ష్య్‌ చౌద‌రి ఆరోపించారు. ఢిల్లీలో తన ప్రత్యర్థులు తనను చంపడానికి ప్రయత్నించారని అత‌డు ఆరోపించారు.

ప్రముఖ యూట్యూబర్ లక్ష్య్‌ చౌద‌రి రష్యా నుండి ఢిల్లీకి తిరిగి వచ్చినప్పుడు తన ప్రత్యర్థులు అమన్ బిస్లా, హర్ష్ వికల్‌ సహా 8-10 మంది గూండాల బృందం తనను హత్య చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. వారు ఆయుధాలు తీసుకుని ఢిల్లీ నుండి నోయిడాకు తన కారును కూడా వెంబడించారని పేర్కొన్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన షాకింగ్ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లక్ష్య్‌ చౌద‌రి ఇలా రాసారు.

నేను, నా స్నేహితులు ఈరోజు 16.02.2025 ఉదయం 4:30 గంటలకు టి-2లో మాస్కో నుండి భారతదేశానికి తిరిగి వచ్చాము. నా స్నేహితుల్లో ఒకరు నా స్కార్పియోలో మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. అమన్ బైస్లా & హర్ష్ వికల్ సహా 8-10 మంది గూండాలు విమానాశ్రయం నుండి చాలా ఆయుధాలతో మమ్మల్ని వెంబడించారు.. దీనిని దిల్లీ పోలీసుల‌కు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసాను. వారు మ‌మ్మ‌ల్ని చంప‌డానికి వచ్చార‌ని నేను గ్ర‌హించాను. అదృష్ట‌వ‌శాత్తూ దీని నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ల‌క్ష్య్ అన్నారు. గూండాలు ఢిల్లీ నుండి నోయిడా వరకు 3 కార్లతో వెంబడించారు. థార్ (DL8CBE9809), ఎటియోస్ (DL10CE0932) వారి కార్ల నంబ‌ర్లు అని కూడా ల‌క్ష్య్ వెల్ల‌డించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి తక్షణ స్పందన లేకపోవడంపై షాక్ కి గుర‌య్యాన‌ని అత‌డు అన్నారు. ``మన రాజధాని నగరంలో కూడా మనం నిజంగా సురక్షితంగా ఉన్నామా? ఎవరైనా ఓపెన్ రోడ్‌లో కేకలు వేయగలరు. ఒక్క పోలీసు హెల్ప్‌లైన్ కూడా నా కాల్ లిఫ్ట్ చేయ‌లేదు. నాకు ఏదైనా జరిగితే ఈ పోలీసులే బాధ్యత వహిస్తారు`` అని ల‌క్ష్య్ రాసాడు.

అమన్, హర్ష్ అనే ఇద్ద‌రు వ్య‌క్తుల ఫేక్ లైఫ్ స్టైల్ ని ప్ర‌పంచానికి బహిర్గతం చేసే యూట్యూబ్ వీడియోను విడుదల చేసిన తర్వాత వారు తనను లక్ష్యంగా చేసుకున్నారని ల‌క్ష్య్ చైద‌రి ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తులు తన ఇన్‌స్టా స్టోరి ద్వారా త‌న‌ను ట్రాక్ చేశారని ల‌క్ష్య్ వెల్లడించాడు. తన కారుపై దాడి జరిగిన వీడియోలను, దాడిలో అద్దాలు పగిలిపోయిన వీడియోలను అతడు షేర్ చేసాడు. అత‌డు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. గూండాలు హాకీ స్టిక్స్ ఇతర ఆయుధాలతో వెంటాడారు. కార్ ని ఛేజ్ చేస్తూ ఆపడానికి ప‌లుమార్లు ఢీకొట్టారు. సకాలంలో తాను తప్పించుకోలేకపోతే వాళ్లు తనను చంపేసేవారని పేర్కొన్నాడు.

Tags:    

Similar News