పిక్‌టాక్‌ : ఎల్లో బికినీలో అందాల లక్ష్మి

తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ఈమె తన అందంతో ఆకట్టుకుంది. ఇప్పటికే చాలా సార్లు బికినీ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.;

Update: 2025-04-03 15:07 GMT
పిక్‌టాక్‌ : ఎల్లో బికినీలో అందాల లక్ష్మి

 

రెండు దశాబ్దాల క్రితం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లక్ష్మి రాయ్‌ సక్సెస్‌ల కోసం పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఈమె ఆఫర్లు తగ్గాయి, కెరీర్‌ ఖతం అనుకున్న ప్రతిసారి లక్కీగా ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది. అనూహ్యంగా ఈమె రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే వచ్చింది. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌తోనూ ఈమెకు మంచి గుర్తింపు లభించింది. కేవలం సౌత్‌ ఇండియన్ సినిమాల్లో మాత్రమే ఈమె నటించకుండా ఇతర భాషల్లోనూ ఈమె నటించడం ద్వారా పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఈమె హిందీలో చేసిన జూలీ 2 తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

2005లో కర్క కసదరా అనే తమిళ్‌ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అదే ఏడాదిలో తెలుగులోనూ కాంచన మాల కేబుల్‌ టీవీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతే కాకుండా తెలుగులో వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్‌, కన్నడం, మలయాళం సినిమాల్లో వరుసగా నటించిన రాయ్ లక్ష్మికి బాలీవుడ్‌ నుంచి పదేళ్ల తర్వాత అకీరా సినిమాతో పిలుపు వచ్చింది. 2016లో అకీరా సినిమాలో నటించిన రాయ్ లక్ష్మికి ఆ తర్వాత మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా అకీరా తర్వాత వచ్చిన జూలీ సినిమాతో హిందీ ప్రేక్షకుల దృష్టిని రాయ్ లక్ష్మి ఆకర్షించింది.

 

సినిమాల్లో పెద్దగా హిట్‌ పర్సంటేజ్‌ లేకపోయినా ఇన్నాళ్లు క్రమం తప్పకుండా ఆఫర్లు దక్కించుకోవడంకు కారణం ఈమె అందం అంటూ కొందరు కామెంట్‌ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఈమె రెగ్యులర్‌గా షేర్‌ చేసే ఫోటోలు, సినిమాల్లో ఈమె చేసే స్కిన్‌ షో కారణంగా రెగ్యులర్‌గా ఆఫర్లు వస్తూ ఉంటాయనే టాక్‌ ఉంది. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ఈమె తన అందంతో ఆకట్టుకుంది. ఇప్పటికే చాలా సార్లు బికినీ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈమె తన అందమైన బికినీ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

 

ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈమె సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి ఎల్లో బికినీలో కనిపించి చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్‌ చేయడం వల్లే ఆఫర్లు సొంతం చేసుకుంటుంది అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక హిందీ సినిమాతో పాటు, వెబ్‌ సిరీస్‌లోనూ ఈమె నటిస్తుంది. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాల్లో ముందు ముందు ఈమె మరిన్ని పాత్రల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఈమెకు సౌత్‌ నుంచి కూడా ఆఫర్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ఈ ఫోటోలకు కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంతటి అందంకు మరో పదేళ్ల వరకు వరుసగా ఆఫర్లు దక్కుతాయని వారు అంటున్నారు.

Tags:    

Similar News