కట్టెల పొయ్యిపై నాగచైతన్య చేపల పులుసు.. అదిరింది!

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడి పాత్ర కోసం నాగ చైతన్య పూర్తిగా పాత్రలో లీనమయ్యారు.

Update: 2025-01-17 06:52 GMT

యువసామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తండేల్"పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కాంబినేషన్ తోనే మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుంది. ఇక సంక్రాంతి తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పాటలు "బుజ్జి తల్లి", "నమో నమ: శివాయ" సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తూ భారీ అంచనాలను పెంచాయి.


ఇక ఈ సినిమా ప్రమోషన్స్ హడావుడి కూడా షురూ అయ్యింది. అందులో భాగంగా నాగ చైతన్య చేసిన వంట ఆయన అభిమానులను మాత్రమే కాకుండా సిక్కోలు ప్రాంత ప్రజలను కూడా ఆకట్టుకుంది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడి పాత్ర కోసం నాగ చైతన్య పూర్తిగా పాత్రలో లీనమయ్యారు. ఈ పాత్రను నిజంగా జీవింపజేయడానికి, స్థానికుల జీవితాలను దగ్గరగా చూసి, వారి జీవన విధానాన్ని అనుసరించారు.

షూటింగ్ కంటే ముందే నాగచైతన్య కొన్ని రోజుల పాటు జనాల జీవనశైలి గురించి దగ్గరుండి తెలుసుకున్నాడు. సముద్రం వెంట నుంచి వారి ప్రేమలు ఆప్యాయతలు కష్టపడే విధానం దగ్గరుండి చూశాడు. ఇక వారితో సరదాగా గడిపి, మొదట్లోనే వారిని ప్రత్యేకంగా ఆకట్టుకునేలా మీకంటే బాగా చేపల పులుసు వండుతాను అని హామీ ఇచ్చారు.

ఆ హామీని పూర్తి చేస్తూ, కట్టెల పొయ్యిపై, మట్టి కుండలో చేపల పులుసు వండి వారిని సంతృప్తి పరచారు. యేటలో చేపలు పట్టేసాక..మంచి పులుసు ఎట్టేయాలి కదా' అంటూ లేటెస్ట్ గా మరో విడోయో విడుదల చేశారు. వీడియోలో నాగ చైతన్య శ్రీకాకుళం పద్దతుల్ని పాటించి, అనుకరణలేకుండా స్వయంగా వంట చేసిన విధానం చూపించారు. అది చూసిన స్థానికులు ఆయన పట్ల గౌరవం పెంచుకొని, వండిన భోజనానికి ప్రశంసలు కురిపించారు. నాగ చైతన్య మంచి మనసున్న వ్యక్తిత్వం, అనుసంధానతకు స్థానికులు ఫిదా అయ్యారు.

ఈ సినిమా విజయవంతం కావాలని, ఆయన నటనకు మరింత ప్రశంసలు రావాలని ఆశీర్వదించారు. చిత్ర దర్శకుడు చందూ మొండేటి, కథలో మత్స్యకారుల జీవన విధానం, వారి కష్టాలు, ఆనందాలను నిజాయితీగా చూపించేందుకు శ్రద్ధ తీసుకున్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు ఇప్పటికే విశేష స్పందన అందుకుంటున్నాయి. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌పై సమర్పణ బాధ్యతలు చేపట్టారు.

"తండేల్" ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగ చైతన్య పాత్ర కోసం చూపించిన పట్టుదల, చేసిన కృషి ఈ సినిమాకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. స్థానిక సంస్కృతిని హైలెట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో నాగ చైతన్య మరింత గ్లోబల్ రేంజ్‌కు వెళ్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Full View
Tags:    

Similar News