బిగ్ బాస్ 8 : ఈ వారం బయటకు వచ్చేది ఎవరు..?

మరి నయని పావని ఈ వారం ఎలిమినేషన్ నుంచి బయట పడుతుందా ఆమె కాకపోతే పృధ్వి, విష్ణు ప్రియల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది.

Update: 2024-10-25 14:29 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో విష్ణు ప్రియ, పృధ్వి, నయని పావని, నిఖిల్, ప్రేరణ, మెహబూబ్ ఉన్నారు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారి ఆటని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం బీబీ రాజ్యం టాస్క్ నడిచింది. ఇప్పటివరకు నామినేషన్స్ ఉన్న వారిలో ఆట బాగానే ఆడుతున్నారు. ఐనా సరే ఈ వారం ఎలిమినేషన్స్ తప్పనిసరి కాబట్టి ఉన్న వారిలో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వారి లిస్ట్ ఇలా ఉంది.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో నిఖిల్, ప్రేరణ టాప్ ఓటింగ్ తో దూసుకెళ్తున్నారు. వీరి తర్వాత పృధ్వి, మెహబూబ్, విష్ణు ప్రియ ఉన్నారు. లీస్ట్ ఓటింగ్ లో డేంజర్ జోన్ లో నయని పావని కొనసాగుతుంది. ఈ వారం బీబీ రాజ్యం టాస్క్ లో ఆమె పర్ఫార్మెన్స్ కూడా అంతగా ఏమి లేదు. బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ గా వచ్చి వారానికే ఎలిమినేట్ అయ్యింది నయని పావని. ఐతే సీజన్ 8 లో కూడా అమ్మడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.

ఐతే ఈ సీజన్ లో ఆమెను మొదటి వారం నామినేషన్ ప్రొటెక్షన్ షీల్డ్ ఇచ్చి కాపాడారు. గత రెండు వారాలుగా ఆమె నామినేషన్స్ లో లేదు. మళ్లీ ఈ వారం నామినేషన్స్ లో ఉంది. మరి నయని పావని ఈ వారం ఎలిమినేషన్ నుంచి బయట పడుతుందా ఆమె కాకపోతే పృధ్వి, విష్ణు ప్రియల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఈ ఆదివారం తెలుస్తుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ రేసులో ప్రస్తుతానికి నిఖిల్ మాత్రమే ఉన్నాడు. ఐతే ఈ వారం బీబీ రాజ్యం లో బస్తాల టాస్క్ లో పృధ్వి పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అతను ఇంకాస్త ఎఫర్ట్ పెడితే అతను కూడా టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి బిగ్ బాస్ ఆడియన్స్ ఓటింగ్ ఎలా ఉంటుంది. ఎవరిని టాప్ 5 కి తీసుకెళ్తారు.. ఎవరిని విన్నర్ చేస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News