ఎన్టీఆర్ 'వార్' కి ఆ సరికొత్త టెక్నాలజీ!
మొదట యాక్షన్ ఎపిసోడ్స్ ను హీరోల బాడీ డబుల్ తో షూట్ చేస్తారు. ఆ తర్వాత ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి హీరోల ఫేస్ లను అద్దబోతున్నారట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో పాటు బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇప్పటికే ఫారిన్ షెడ్యూల్ తో పాటు ముంబై షెడ్యూల్ ను పూర్తి చేసిన దర్శకుడు అయాన్ ముఖర్జీ కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇద్దరు హీరోల డేట్లు ఒకే సారి లభించడం అనేది కాస్త కష్టంగా కూడుకున్న విషయం. అందుకే సరికొత్త టెక్నాలజీని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారట.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా హీరోలు ఇద్దరు కూడా ఎక్కువ కష్టపడుకుండానే షూటింగ్ సాగుతుందని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఇద్దరు హీరోల బాడీ డబుల్ ప్లాన్ చేశారు.
మొదట యాక్షన్ ఎపిసోడ్స్ ను హీరోల బాడీ డబుల్ తో షూట్ చేస్తారు. ఆ తర్వాత ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి హీరోల ఫేస్ లను అద్దబోతున్నారట. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు సౌత్ లో కొన్ని సినిమాలకు ఈ టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది.
వార్ 2 కోసం మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాకు ఉపయోగించనంతగా ఈ టెక్నాలజీని వినియోగించబోతున్నారు. కనీసం డౌట్ రాకుండా, నూటికి నూరు శాతం సహజంగా ఉండే విధంగా ఈ టెక్నాలజీని విదేశీ నైపుణ్యం ఉన్న వారితో చేయించబోతున్నారట. వచ్చే ఏడాదిలో వార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.