వైజాగ్ బీచ్ క్లీన్ చేసిన లావణ్య త్రిపాఠి
YMCA బీచ్‌లో ఉదయం 7:30 నుండి ప్రారంభమై స్థానిక NGO వైజాగ్ వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
పరిశుభ్రతలో వాస్తవ ప్రపంచ నిబద్ధత పరిణామాల నేపథ్యంలో డిస్నీ+ హాట్‌స్టార్ స్పెషల్స్ సిరీస్ `మిస్ పర్ఫెక్ట్`లో తమ సందేశాత్మక పాత్రలతో మురిపించనున్న నటీమణులు లావణ్య త్రిపాఠి, అభిజ్ఞ వూతలూరు స్వచ్ఛతా ప్రచారంలో ముందున్నారు. 28 జనవరి 2024న జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా వైజాగ్‌లోని రామకృష్ణ బీచ్‌లో చెత్త ఏరారు.
YMCA బీచ్‌లో ఉదయం 7:30 నుండి ప్రారంభమై స్థానిక NGO వైజాగ్ వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విస్తృతమైన క్లీనింగ్ కార్యక్రమం జనవరి 30న జరగబోయే జాతీయ పరిశుభ్రత దినోత్సవంతో సమానంగా సాగుతుంది. నాలుగు వారాంతాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. ``బీచ్ పర్ఫెక్ట్ విత్ మిస్ పర్ఫెక్ట్`` అని సముచితంగా పేరు పెట్టిన ఈ ఈవెంట్ పరిశుభ్రత పర్యావరణ సారథ్యం ప్రాముఖ్యతను నొక్కిచెప్పడమే లక్ష్యంగా చేస్తున్న కార్యక్రమం.
బీచ్ క్లీనింగ్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న లావణ్య త్రిపాఠి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువుగా మారింది. తన ఆలోచనలను తెలియజేస్తూ ``అందమైన విశాఖ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలి`` అని అన్నారు. ఫిబ్రవరి 2న విడుదల కానున్న `మిస్ పర్ఫెక్ట్` వెబ్ సిరీస్‌లో నేను పరిశుభ్రతకు అంకితమైన మహిళగా కనిపిస్తానని తెలిపారు. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ లావణ్య రావు పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పరిశుభ్రతపై తనకున్న నిబద్ధతకు గుర్తింపు పొందిన లావణ్య జీవితం వినోదభరితంగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఇది హాస్యభరితమైన ర్యాట్ అండ్ క్యాట్ గేమ్‌కు దారితీస్తుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్ అని తెలుస్తోంది.
నేషనల్ క్లీన్లీనెస్ డే జ్ఞాపకార్థం కాకుండా, క్లీన్‌నెస్ డ్రైవ్ ఈవెంట్ కి సంబంధించిన అసమానమైన కథను చెప్పే ఆలోచనలతో డిస్నీ+ హాట్‌స్టార్ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. హాస్యం లవ్ నవ్వులతో నిండిన ప్రపంచంలోకి మనల్ని తీసుకుని వెళుతుంది. పరిశుభ్రత అంబాసిడర్‌గా, లావణ్య త్రిపాఠి పరిశుభ్రత పర్యావరణ స్పృహపై పని చేస్తుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు, ఆహా కోసం `బ్యూటీ అండ్ ది బేకర్` .. ప్రైమ్ వీడియో కోసం `వ్యూహం` వంటి ప్రశంసలు పొందిన సిరీస్‌లలో పనిచేసినందుకు ప్రసిద్ధి చెందిన విశ్వక్ ఖండేరావు `మిస్ పర్ఫెక్ట్` చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ నటి శ్రుతి రామచంద్రన్ ఆమె భర్త, అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ మరియు స్క్రీన్ రైటర్ ఫ్రాన్సిస్ థామస్ రూపొందించిన స్క్రీన్ ప్లే ప్రధాన అస్సెట్. ఈ ధారావాహికకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించగా, ఆదిత్య జవ్వాది ద్వారా సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ అందించారు. అభిజిత్, అభిజ్ఞ వూతలూరు, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేశ్ విట్టా, హర్ష్ రోషన్, సునైనా తదితరులు నటించారు.