మెగా ఇంట కొత్త కోడలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇది!
మెగా వారసుడు వరుణ్ తేజ్ ని పెళ్లాడి లావణ్య త్రిపాటి కొణిదెల వారింట కొడలిగా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
మెగా వారసుడు వరుణ్ తేజ్ ని పెళ్లాడి లావణ్య త్రిపాటి కొణిదెల వారింట కొడలిగా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ నటిగా చూసిన లావణ్యని ఇకపై కొణిదెల వారింట కోడలిగా చూస్తాం. మరి వృత్తిలో కొనసాగుతారా? మెగా ఇంట కోడలి బాధ్యతలకే అంకితమవుతారా? అన్నది చూడాలి. ఆ సంగ తులు పక్కనబెడితే! లావణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ఎక్కడ నుంచి వచ్చారు? ఆమె సినిమా జీవితం ఎలా ప్రారంభమైంది? కుటుంబ నేపథ్యం ఏంటి? అన్నది ఇంతవరకూ పెద్దగా బయటకు రాలేదు.
పెళ్లి సందర్భంలోనే ఆమె తల్లిదండ్రుల గురించి పెద్దగా వార్తలు రాలేదు. ఈనేపథ్యంలో లావణ్య పుట్టింట వాళ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆరా తీయగా ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో బయటకువస్తున్నాయి. లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించారు. ఆమె తండ్రి హైకోర్టు న్యాయమూర్తి. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. లావణ్యకి ఒక చెల్లి-తమ్ముడు ఉన్నారు. చెల్లి అసిస్టెంట్ కమీషనర్ కాగా..తమ్మడు తండ్రిలాగే న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు.
కానీ చెల్లి-తమ్ముడిలా లావణ్య ఆలోచించలేదు. అందరికంటే లావణ్య యూనిక్ గా ఉండాలనుకున్నారు? అందుకే సినిమా రంగంలోకి వచ్చారు. తొలుత సినిమాలు చేయడానికి ఇంట్లో ఒప్పుకోలేదు. తండ్రి చదువు మీద దృష్టి పెట్టు అన్నారుట. సినిమాలంటే? తల్లి కంగారు పడ్డారుట. మనకు తెలియని ఫీల్డ్ ఎందుకని నిరుత్సాహ పరిచారుట. కానీ లావణ్య ఆలోచనలు పదవ ఏట నుంచి వైవిథ్యంగా ఉండటంతో బలమైన సంకల్పంతో ఇటువైపుగా వచ్చారు. పదవ తరగతి వరకూ ఆయోధ్యలోనే చదివి అటుపై కుటుంబం ముంబై రావడంతో అక్కడ ఇంటర్మీడియట్ పూర్తిచేసారుట.
ఆపై చదువులన్నీ అక్కడే సాగాయి. అదే సమయంలో మోడలింగ్ కూడా ప్రారంభించిందిట. తొలుత సినిమా అవకాశాలు రాకపోవడంతో సీరియళ్లు కూడా చేసిందిట. ఆ తర్వాత తన స్నేహితులు కొందరు అందాల రాక్షసి ఆడిషన్ కి ఆమె ఫోటోలు పంపించారుట. అందులో ముగ్గురు ఎంపిక చేయగా ఫైనల్ గా ఆ పాత్రకి లావణ్య అయితే బాగుంటుందని మేకర్స్ ఆమెని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.