నా మొగుడిని కలవాలి… లావణ్య హడావిడి
నా భర్తని నేను కలవాలనుకుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు. నా భర్తతో మాల్వీ ఎందుకు తిరుగుతుంది. ఇద్దరు కలిసి ఎందుకు ఉంటున్నారనేది నాకు సమాధానం చెప్పాలంటూ లావణ్య ప్రశ్నించింది.
రాజ్ తరుణ్, లావణ్య వివాదం టాలీవుడ్ లో ఎంత చర్చనీయాంశంగా మారిందో అందరికి తెలిసిందే. లావణ్య మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ పైన చాలా ఆరోపణలు చేసింది. అలాగే అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ కి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ వ్యవహారం ఇలా సాగుతూనే ఉంది. చట్టపరంగా రాజ్ తరుణ్ తో న్యాయపోరాటానికి లావణ్య సిద్ధమైంది.
చట్టపరిధిలో ఈ వ్యవహారం నడుస్తూ ఉండగానే లావణ్య మరల బయటకి వచ్చింది. తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో తిరగబడర సామి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ దగ్గరకి లావణ్య వచ్చి కాస్తా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది రాజ్ తరుణ్ ను కలవాలంటూ వచ్చిన లావణ్య.. తిరగబడర సామి మూవీ ప్రెస్ మీట్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పోలీసులు ఆమెని అడ్డుకున్నారు. నా రాజ్ తో మాట్లాడనివ్వండి.
నా భర్తని నేను కలవాలనుకుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు. నా భర్తతో మాల్వీ ఎందుకు తిరుగుతుంది. ఇద్దరు కలిసి ఎందుకు ఉంటున్నారనేది నాకు సమాధానం చెప్పాలంటూ లావణ్య ప్రశ్నించింది. రాజ్ తరుణ్ ని కలిసి అన్ని విషయాలు అడుగుతానంటూ లావణ్య హడావిడి చేసింది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే వాడు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు. నోటీసులకి ఎందుకు సమాధానం చెప్పడం లేదు అంటూ లావణ్య మాట్లాడింది. చట్టప్రకారం నేను న్యాయ పోరాటం చేస్తాను.
రాజ్ తరుణ్ నాకు కావాలి. అతని కోసం ఎంతవరకైనా ఫైట్ చేస్తానంటూ లావణ్య ప్రసాద్ ల్యాబ్స్ ముందు మీడియాతో మాట్లాడింది. అయితే లావణ్య గందరగోళం సృష్టించడంతో పోలీసులు ఆమెని అడ్డుకున్నారు. ఇక తాజాగా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లిన లావణ్య అతనితో మాట్లాడాలని ప్రయత్నం చేసింది. అయితే రాజ్ తరుణ్ ఇంటి లోపల ఉన్న డోర్స్ ఓపెన్ చేయలేదు. చాలా సేపు అపార్ట్మెంట్ దగ్గర ఆమె వెయిట్ చేసింది.
నా డాగ్స్ ని చూడటానికి వచ్చానని, అనుమతించాలని డిమాండ్ చేసింది. లావణ్యతో వివాదంపై రాజ్ తరుణ్ తిరగబడర సామి ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, వాటితో చట్టపరంగా ఫైట్ చేస్తానని తెలిపారు. ప్రతిసారి మీడియా ముందుకొచ్చి ఆమెపై ఆరోపణలు చేయాలని అనుకోవడం లేదంటూ రాజ్ తరుణ్ తెలిపారు.