అవమానానికి నటుడి పంచ్ అలా!
లారెన్స్ నటించిన 'జిగర్తాండ -2' సినిమాలో తెలుగు వెర్షన్ లో' నల్ల హీరో' అనే డైలాగ్ ఒకటుంది. ఈ డైలాగ్ కి..లారెన్స్ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గర సంబంధ ఉంది.
ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా..కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు అవమానాలు తప్పనిసరి. ఎదిగే క్రమంలో ఎన్నో విమర్శలు..అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటివేటిని పట్టించుకోకుండా ముందుకెళ్తేనే సక్సెస్ అయ్యేది. తిరిగి సమాధానం చెప్పగలిగే స్థాయికి చేరుకునేది. రాఘవలారెన్స్ కూడా అలా ఎదిగిన నటుడే. ఎలాంటి సహకారం లేకుండా గ్రూప్ డాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు.
అటుపై నటుడిగా...ఆ తర్వాత దర్శకుడిగానూ మారారు. కష్టే ఫలి అనడానికి లారెన్స్ ని గొప్ప స్పూర్తిగా చెప్పొచ్చు. లారెన్స్ మృదు స్వభావి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడినే ఆశ్చర్యపరించి. చిరు ఇష్టపడే వ్యక్తుల్లో లారెన్స్ కూడా ఒకరు. లారెన్స్ సేవా కార్యక్రమాలకి ఎంతో మంది సెలబ్రిటీ అభిమానులే ఉన్నారు. గోప్ప మానవతా దృక్ఫధం గల వ్యక్తి. అయితే లారెన్స్ తొలిసారి ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు.
లారెన్స్ నటించిన 'జిగర్తాండ -2' సినిమాలో తెలుగు వెర్షన్ లో' నల్ల హీరో' అనే డైలాగ్ ఒకటుంది. ఈ డైలాగ్ కి..లారెన్స్ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గర సంబంధ ఉంది. గ్రూప్ డాన్సర్ గా ఉన్న రోజుల్లో లారెన్స్ నల్లగా ఉన్నాడని వెనుక నిలబడమనేవారని లారెన్స్ గుర్తు చేసారు. అలా ఒకసారి కాదు...చాలాసార్లు అవమానానికి గురయ్యాడు. అలా అవమానించడమే లావరెన్స్ లో పట్టుదల పెరిగింది.
నేడు ఈ స్థాయికి రాగలిగాడు అన్నది ఆయన ఉద్దేశం. తాజాగా సినిమాలో మొదటి నల్ల హీరో డైలాగ్ వెనుక ఈ కథ అంతా ముడిపడి ఉందని వినిపిస్తుంది. తాను అవమానాలు ఎదుర్కున్న ఇండస్ట్రీలో కాకుండా తెలుగు లో ఆ డైలాగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆరకంగా తనని విమర్శించిన వాళ్లకు పరోక్షంగా పంచ్ వేసినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.