భ‌వ‌న నిర్మాణ కార్మికుడు నేడు పేరున్న న‌టుడు!

ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి స‌క్సెస్ అయిన వారెంతో మంది ఉన్నారు

Update: 2023-11-27 00:30 GMT

ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి స‌క్సెస్ అయిన వారెంతో మంది ఉన్నారు. లైట్ బోయ్ గా..మ్యాక‌ప్ ఆర్టిస్ట్ గా....అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి న‌టుడిగా పేరు తెచ్చుకున్న వారెంతో మంది. ఇంకా వివిధ శాఖ‌ల్లో ఉన్న‌త స్థానాల్లోనూ కొన‌సాగుతున్నారు. అవ‌కాశం వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తిభ నిరూపించుకుంటే ? అత‌డి స్థాయిని ప‌రిశ్ర‌మ రాత్రికి రాత్రే మార్చేస్తుంది. అలాంటి వారెంతో మంది. తాజాగా అలాంటి మ‌ట్టిలో మాణిక్య‌మే ల‌క్ష్మ‌ణ్ మీసాల‌.

'జార్జిరెడ్డి' సినిమాలో కీల‌క పాత్ర పోషించిన ల‌క్ష్మ‌ణ్ సుప‌రిచితుడే. బ‌క్క ప‌ల‌చ‌ని శ‌రీరం...జుల‌పాల జుట్టు..గెడ్డం తో క‌నిపించే! ల‌క్ష్మ‌ణ్ పేరు ఇటీవ‌ల రిలీజ్ అయిన 'మంగ‌ళ‌వారం' తో మారుమ్రోగుతుంది. అంధుడి పాత్ర‌లో అత‌డి కామెడీ టైమింగ్‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమా ల‌క్ష్మ‌ణ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ విజ‌యం మ‌రిన్ని సినిమాల్లో అవ‌కాశాలు క‌ల్పిస్తాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అత‌డి జ‌ర్నీ గురించి రివీల్ చేసాడు. 'నేను భవన నిర్మాణ కార్మికుడిగా ప‌నిచేసేవాడిని. మెగాస్టార్ చిరంజీవి - అల్లు అరవింద్ - ఇంకా చిత్ర పరిశ్రమలోని ఇతరుల ఇళ్లను నిర్మించే బృందాలలో నేను ఒక స‌భ్యుడిని. నిర్మాణానికి సంబంధించి అన్ని ర‌కాల ప‌నులు చేసేవాడిని. ఇంకా ఇండ‌స్ట్రీకి రాక‌ముందు చాలా ప‌నులు చేసాను. అలా జీవ‌నం సాగిస్తున్న సినిమాల‌పై ఆస‌క్తి ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోనే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టి ఈ రంగంలోకి వ‌చ్చాను' అని అన్నారు.

లక్ష్మణ్ హైదరాబాద్‌లోని ప్రముఖ యాక్టింగ్ కోచ్ దీక్షితులు ఆధ్వర్యంలో ప‌నిచేసారు. అక్కడ అతను నటనలోని ఓన‌మాలు దిద్దుకున్నాడు. అక్క‌డ నుంచే అత‌ని జ‌ర్నీ మొద‌లైంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎదిగిన వారంతా అలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వారే. ఎన్నో ఏళ్ల శ్ర‌మ‌...ఆక‌లి..నిద్ర‌లేని రాత్రుళు చూసిన వారే.

Tags:    

Similar News