లియో తీరు మార్చుకోవాల్సిందే..
అయితే ఓవర్సీస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం మూవీలో కొన్ని సీక్వెన్స్ కట్ వేసినట్లు తెలుస్తోంది.
ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. దేశ వ్యాప్తంగా మూవీపైన భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
దళపతి ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయం అని అనుకుంటున్నారు. ఈ మూవీ రన్ టైం కూడా ఇప్పటికే లాక్ అయిపొయింది. 164 నిమిషాల నిడివితో మూవీ ఉండబోతోంది. అయితే ఓవర్సీస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం మూవీలో కొన్ని సీక్వెన్స్ కట్ వేసినట్లు తెలుస్తోంది.
యూరప్ లో 15 ఏ సర్టిఫికేట్ కోరడంతో అక్కడి సెన్సార్ బోర్డు మూవీకి చాలా కట్స్ వేసిందంట. అలాగే యూఎస్ లో కూడా సెన్సార్ కట్ తో 159 నిమిషాల 50 సెకండ్స్ ఉంటుందంట. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఓవర్సీస్ లో మూవీ కచ్చితంగా మళ్ళీ సెన్సార్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నిర్మాతల డిమాండ్ బట్టి ఆ సినిమాకి ఇచ్చే సర్టిఫికేట్ బట్టి సెన్సార్ కట్స్ ఉంటాయంట
యూరప్ లో లియో అన్ కట్ వెర్షన్ కూడా కొన్ని థియేటర్స్ లో ఉంటుందంట. అలాగే ఫ్యామిలీ అడియన్స్ కి కావాల్సిన వెర్షన్ కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కోలీవుడ్ లో కబాలి సినిమా ఓవర్సీస్ లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. 6.5 మిలియన్స్ కలెక్షన్స్ ని సాధించింది.
లియో సినిమాతో కబాలి రికార్డులు బ్రేక్ చేయాలని అనుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 7 మిలియన్స్ కలెక్షన్స్ వచ్చేశాయని తెలుస్తోంది. ఒక వేళ ఇదే కలెక్షన్స్ కొనసాగితే మాత్రం కబాలి ఓవర్సీస్ ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది.