లియో ఓటీటీ.. ఈ రిజల్ట్ ఊహించనది
ఇప్పటి వరకు లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన అన్ని సినిమాలలో కంటే బ్యాడ్ మూవీ లియో అని కామెంట్స్ వచ్చాయి.
ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ లియో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ పరంగా సాలిడ్ రిజల్ట్ వచ్చింది. మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రమిది. ఇప్పటి వరకు లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన అన్ని సినిమాలలో కంటే బ్యాడ్ మూవీ లియో అని కామెంట్స్ వచ్చాయి.
అయితే ఊహించని విధంగా ఈ సినిమా ఐదు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. 2023 లో టాప్ ఇండియన్ గ్రాస్ చిత్రాలలో స్థానం సంపాదించింది. రీసెంట్ గా ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేశారు. డిజిటల్ రిలీజ్ లో కూడా లియో మూవీకి ఊహించని స్థాయిలో స్పందన వస్తూ ఉండటం విశేషం. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో లియో ఒరిజినల్ తమిళ వెర్షన్ కంటే లియో హిందీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్లు టాప్ లో ఉండటం విశేషం.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఇండియా లో లియో హిందీ, తెలుగు వెర్షన్లు 1, 2 స్థానాల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒరిజినల్ వెర్షన్ మాత్రం మూడో స్థానాన్ని ఉండటం గమనార్హం. దీనిని బట్టి తెలుగు, హిందీ ఆడియన్స్ డిజిటల్ లో లియో మూవీని ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని అర్ధమవుతోంది. దళపతి విజయ్ కి తమిళనాట భారీగా ఫ్యాన్ బేస్ ఉంది.
వారందరూ మేగ్జిమమ్ థియేటర్స్ లోనే మూవీ చూసేస్తారు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీలో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. లియో మూవీ తెలుగు, హిందీ భాషలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే డిజిటల్ రిలీజ్ తర్వాత ఎక్కువ మంది చూస్తున్నారని తెలుస్తోంది. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఈ మూవీలో కథానాయికగా నటించింది.
గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం కూడా లియో సక్సెస్ లో ఒక భాగం అయ్యిందని చెప్పాలి. సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.