స్టార్ హీరోతో గొడవ.. 23 ఏళ్ల తర్వాత స్పందించిన డైరెక్టర్..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన లింగుస్వామి తమిళంలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నారు.

Update: 2024-04-19 13:30 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన లింగుస్వామి తమిళంలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన పందెంకోడి, ఆవారా సినిమాలు తెలుగులో కూడా రిలీజై మంచి ప్రేక్షకాదరణ పొందాయి. డైరెక్టర్ గా ఎంత ప్రతిభ ఉన్నా సరే లింగుస్వామికి కాస్త టెంపర్ ఎక్కువ అన్న టాక్ ఉంది. కెరీర్ మొదట్లోనే ఆయన మలయాళ స్టార్ మమ్ముట్టితో సెట్స్ లో గొడవ పడ్డారన్న టాక్ వచ్చింది. ఆ గొడవపై ఇప్పటివరకు నోరు విప్పని లింగుస్వామి రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ విషయంపై స్పందించారు.

లింగుస్వామి మొదటి సినిమా ఆనందంలో మమ్ముట్టి నటించారు. ఆ సినిమా షూటింగ్ లో తలెత్తిన సమస్యలకు పూర్తి బాధ్యత తనదే అన్నారు లింగుస్వామి. మొదటి సినిమా ఇండస్ట్రీకి కొత్త అవ్వడంతో అన్ని విషయాలను కచ్చితంగా ఉందాలని అనుకున్నా.. అయితే ఆ టైం లో ఎన్నో సినిమాల్లో నటించిన మమ్ముట్టి చెప్పిన సలహాలు తాను పటించలేదు. ఆ టైం లో ఆయనకు కోపం వచ్చింది. అయితే ఇప్పుడు తమ మధ్య ఎలాంటి దూరం లేదని అన్నారు. ఇప్పటికీ మమ్ముట్టితో ఫోన్ లో మాట్లాడుతున్నా ఆయన ఇటీవల నటించిన భ్రమయుగం ట్రైలర్ చూసి ఆయనకు కాల్ చేశానని అన్నారు లింగుస్వామి.

ఇక ఇదే ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తో తీయాల్సిన సినిమా గురించి కూడా ప్రస్తావించారు లింగుస్వామి. కమల్ నటించిన ఉత్తమవిలన్ సినిమా నిర్మించిన లింగుస్వామి ఆ సినిమా వల్ల చాలా నష్టపోయానని అన్నారు. ఆ సినిమా ఫైనల్ కపీ తర్వాత కొన్ని మార్పులు సూచించినా ఆయన పట్టించుకోఏదు. అయితే ఆ సినిమా నష్టాలను బర్తీ చేసేందుకు కమల్ మాతో ఒక సినిమా చేస్తానని అన్నారు. కానీ కథ మాటిమాటికి మార్చుతూ రావడంతో అది కూడా జరగలేదు.

కమల్ హాసన్ తో దృశ్యం రీమేక్ చేయాలని అనుకోగా ఆయన దానికి ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత ఆయన మరొకరితో ఆ సినిమా చేశారని అన్నారు లింగుస్వామి. డైరెక్టర్ గా కెరీర్ లో కాస్త వెనకబడిన లింగుస్వామి తిరిగి ఫాం లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ రాం తో ది వారియర్ సినిమా చేసిన లింగుస్వామి ఆ సినిమాతో తెలుగు, తమిళంలో హిట్ అందుకుంటారని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న లింగుస్వామి ప్రస్తుతం మంచి కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News