RC16 సెట్స్‌లో ఎవ‌రు ఆ లిటిల్ గెస్ట్?

జాన్వీకపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-02-06 04:00 GMT

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజ‌ర్' కోసం రెండేళ్లు పైగానే శ్ర‌మించారు. సుదీర్ఘ షెడ్యూళ్లు, ప్ర‌మోష‌న్స్, తుది ఫ‌లితం త‌ర్వాత‌.. ఇప్పుడు త‌న త‌దుప‌రి చిత్రాన్ని వేగంగా ప‌రుగులు పెట్టిస్తున్నాడు. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలోని RC16 సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జాన్వీకపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.


ఇప్పుడు హైద‌రాబాద్ లోని షూటింగ్ లొకేషన్‌లో ఒక ప్రత్యేక అతిథి కనిపించింది. లిటిల్ గెస్ట్ కానీ సూప‌ర్ స్టార్ ని కూడా శాసించేట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవ‌రా లిటిల్ గెస్ట్ ? అంటే.. రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కారా. తన తండ్రితో కలిసి సెట్‌కి రావ‌డమే కాదు.. దూరంగా చేతిని చూపిస్తూ తండ్రికి ఏదో సూచిస్తోంది. క్లిన్ కారా క్యూట్ గా లొకేష‌న్ లో సంద‌డి చేయ‌డం అందరి దృష్టిని ఆకర్షించింది.

చరణ్ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా, సూప‌ర్ స్టార్ గా హోదాను సంపాదించుకున్నా.. అత‌డికి ఒక తండ్రిగా ఇంత‌టి మ‌ధుర‌మైన క్ష‌ణం మ‌రొక‌టి ఉండ‌దు. కుమార్తెతో ఆన్ లొకేష‌న్ అరుదైన సంద‌ర్భ‌మిది. ఈ ఫోటోగ్రాఫ్ చ‌ర‌ణ్ ఆల్బ‌మ్ లో ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.

ఆ లొకేష‌న్ ని చూస్తుంటే ఏదో విలేజ్ లో జాత‌ర కోసం రెడీ చేసిన సెట‌ప్ లా క‌నిపిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో సాగే, క్రీడా నేప‌థ్య చిత్రం కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టుగానే లొకేష‌న్ ని సెట్ చేసారు. ఉప్పెన లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చాకా బుచ్చిబాబు చాలా కాలం వేచి చూడ‌ట‌మే కాకుండా, రామ్ చ‌ర‌ణ్ తో మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని పంతంతో క‌నిపిస్తున్నాడు. అత‌డి హార్డ్ వ‌ర్క్, ఎదురు చూపులు స‌ఫ‌ల‌మవ్వాల‌ని ఆశిద్దాం.

Tags:    

Similar News