ఖైదీ సీక్వెల్.. కొత్త మ్యాటర్ ఏంటంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీతో బిజీగా ఉన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఖైదీ-2ను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

Update: 2024-10-26 10:29 GMT

కోలీవుడ్ హీరో కార్తీ, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ఖైదీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2019లో విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి మేకర్స్ కు ఫుల్ లాభాలు అందించింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌ తో తెరకెక్కిన ఆ చిత్రంలో కార్తీ నటన హైలెట్‌ గా నిలిచింది. అదే సమయంలో కెరీర్ లో రెండో మూవీతోనే వేరే లెవెల్ లో ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు లోకేష్ కనగరాజ్. తన టాలెంట్ ఏమిటో ప్రూవ్ చేసుకున్నారు.

అయితే ఖైదీ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే పలుమార్లు లోకేష్ కనగరాజ్, కార్తీ చెప్పారు. దీంతో అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో రీసెంట్ గా లోకేష్ ఇచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖైదీ చిత్రం రిలీజ్ అయ్యి ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా ఎక్స్ లో ఆయన పోస్ట్ పెట్టారు. అందులో త్వరలో ఢిల్లీ తిరిగి రానున్నారని రాసుకొచ్చి హైప్ క్రియేట్ చేశారు.

"అంతా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. కార్తీతో పాటు ఎస్ ఆర్ ప్రభుకు థ్యాంక్స్.. వీరి వల్ల లోకేష్ యూనివర్స్ పాజిబుల్ అయింది. త్వరలో ఢిల్లీ (ఖైదీ చిత్రంలో కార్తీ రోల్ నేమ్) తిరిగి రానున్నారు" అని లోకేష్ పోస్ట్ పెట్టారు. దీంతో ఖైదీ-2 ఉందని మరోసారి అఫీషియల్ గా చెప్పేశారు. దీంతో కార్తీ ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఫస్ట్ పార్ట్ అదిరిపోయిందని, సీక్వెల్ అంతకు మించి ఉంటుందని చెబుతున్నారు.

అదే సమయంలో లోకేష్ కనగరాజ్.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీతో బిజీగా ఉన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఖైదీ-2ను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. అన్నీ సరైన రీతిలో సిద్ధం చేసుకుని సెట్స్ పైకి ఖైదీ సీక్వెల్ ను లోకేష్ తీసుకెళ్లనున్నారని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే ఖైదీ సీక్వెల్ కోసం అప్డేట్ ఇచ్చిన తర్వాత.. లోకేష్ మరో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఎల్‌ సీయూ ఆరిజిన్స్‌ అంటూ 10 మినిట్స్ ప్రీ లూడ్ వీడియోను విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అందులో అస‌లు ఖైదీ, విక్ర‌మ్ సినిమాల‌కు క‌థ ఎలా పుట్టుకొచ్చిందన్న విషయంతోపాటు రెండు సినిమాల‌ను ఎలా క‌నెక్ట్ చేశామనేది లోకేష్ చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. దీంతో ఆ వీడియో కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News