వారం ముందే సరికొత్త 'లియో'...!

తమిళ్‌ సూపర్ స్టార్‌ విజయ్ హీరో గా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా దసరా కానుకగా పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల అయిన విషయం తెల్సిందే.

Update: 2023-11-06 04:50 GMT

తమిళ్‌ సూపర్ స్టార్‌ విజయ్ హీరో గా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా దసరా కానుకగా పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల అయిన విషయం తెల్సిందే. లోకేష్ కనగరాజ్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో లియో సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అని.. విజయ్ సినిమాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించబోతున్న సినిమా గా ఫ్యాన్స్‌ చాలా నమ్మకం పెట్టుకున్నారు.

లియో సినిమా తమిళనాట పర్వాలేదు అనిపించినా కూడా ఇతర భాషల్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లియో కి నమోదు అయిన వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే తమిళ్ మీడియా వారు మరియు విజయ్ ఫ్యాన్స్ మాత్రం లియో సూపర్‌ డూపర్ హిట్ అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా థియేట్రికల్‌ రన్ మొదటి రెండు వారాలు మాత్రమే అన్నట్లుగా సాగింది. మూడో వారం నుంచి వసూళ్లు పూర్తిగా డౌన్ అయ్యాయి. దాంతో ఈ సినిమా ను వారం ముందే ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. నెట్‌ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు వారు సినిమా కు యావరేజ్ టాక్ రావడంతో మూడో వారం పూర్తి అయిన వెంటనే స్ట్రీమింగ్‌ కి రెడీ అవుతున్నారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్‌ 20 లేదా 21న స్ట్రీమింగ్ చేయాలని భావించిన లియో సినిమాను నవంబర్‌ 16న స్ట్రీమింగ్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చారు అంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి లియో సినిమా వసూళ్లు డ్రాప్ అవ్వడంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ కి రెడీ అవుతున్నారు.

ఓటీటీ లో థియేటర్ లో వచ్చిన లియో కాకుండా సరికొత్త లియో కనిపిస్తాడు అంటూ మేకర్స్ చెబుతున్నారు. లియో సినిమా లో దాదాపుగా 20 నిమిషాల అదనపు సన్నివేశాలను యాడ్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన రీ ఎడిటింగ్ ఇప్పటికే మొదలైంది. ఒకటి రెండు రోజుల్లో ఓటీటీ ఫైనల్ కాపీ రెడీ అవ్వబోతుంది... 16న స్ట్రీమింగ్‌ అవ్వబోతుందట.

Tags:    

Similar News