వీడియో: లోకేష్-శ్రుతిహాసన్ లవ్ బ్రేకప్ కూడా..!
మూడోది లోకేష్ అనుకోకుండా హీరో అయితే అతడిని డైరెక్టర్ గా విపరీతంగా అభిమానించే ప్రేక్షకులకు చాలా నష్టం!
ఈ వీడియో చూశాక.. మూడు విషయాలు అర్థమవుతాయి. ఒకటి.. ట్యాలెంటెడ్ లోకేష్ కనగరాజ్లో డైరెక్టర్ ని రొమాంటిక్ ఫెలో డామినేట్ చేస్తున్నాడు. రెండోది అతడిలో హీరో అయ్యే క్వాలిటీస్ అనూహ్యంగా బయటపడ్డాయి. మూడోది లోకేష్ అనుకోకుండా హీరో అయితే అతడిని డైరెక్టర్ గా విపరీతంగా అభిమానించే ప్రేక్షకులకు చాలా నష్టం!
అంతగా నష్టం కష్టం కలిగించే పని లోకేష్ కనగరాజ్ ఏం చేస్తున్నాడు? అంటే.. ఇదిగో ఇక్కడ ఈ వీడియోనే ప్రూఫ్. ఏమైందో ఏమో ఉన్నట్టుండి లోకేష్ కనగరాజ్ లోని రొమాంటిక్ హీరో బయటికి వచ్చాడు. అతడు దర్శకుడిగా సినిమాలు తీయకుండా ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ హీరోయిన్ శ్రుతిహాసన్ తో రొమాంటిక్ సాంగ్ లో పెర్ఫామ్ చేసి నటుడిగా ప్రమోటైపోయాడు. ఒకసారి మేకప్ వేశాక.. నటన అనే మత్తు నషాలానికి ఎక్కాక ఎవరికైనా అటువైపు లాగేస్తుంది. ఇకపై లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వదిలేసి, హీరోగా సెటిలవుతాడేమోననే ఆందోళన ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది.
అంతగా ఈ వీడియో వర్కవుటైంది మరి. ఇంతకీ వీడియోలో మ్యాటర్ ఏం ఉంది? అంటే.. వివరాల్లోకి వెళ్లాలి. నిజానికి ఈ వీడియో సాంగ్లో డెబ్యూ నటుడిగా ఆరంగేట్రం చేసిన లోకేష్ కనగరాజ్ శ్రుతిహాసన్ తో అద్భుతంగా రొమాన్స్ చేసాడు. థియేటర్ కి ప్రియురాలితో వెళ్లడంతోనే ఫస్ట్ డేట్ మొదలు పెట్టిన అతడు ఫ్లాట్ కి జంటగా కలిసి వెళ్లడం వరకూ .. సహజీవనం చేయడం మొదలు, రొమాన్స్ లో మునిగి తేలడం వరకూ.., ఉన్నట్టుండి కలతలు.. అంతలోనే బ్రేకప్ వరకూ వెళ్లిపోవడం.. వగైరా వగైరా ఆశ్చర్యపరుస్తాయి. కేవలం నిమిషాల నిడివిలోని పాటలో ఏకంగా లైఫ్ నే చూపించేశారు. డేటింగ్ తో మొదలై సహజీవనం ప్రారంభించి, చివరికి కొట్లాట వరకూ వెళ్లి కన్నీళ్లు పెట్టుకుని విడిపోయేంత వరకూ వెళుతుంది వ్యవహారం. ఓవరాల్ గా ఈ వీడియోలో శ్రుతిహాసన్ తో లోకేష్ కనగరాజ్ రొమాన్స్ ఒక రేంజులో వర్కవుటైంది. ఇక లోకేష్ కూడా తమిళంలో పెద్ద హీరో అయ్యే ఛాన్సుందని ప్రూవ్ అయింది. అతడి లుక్, గిరజాల జుత్తు, స్మార్ట్ నెస్ చాలా మంది తమిళ హీరోలతో పోలిస్తే బెస్ట్ గా ఉందని కితాబివ్వొచ్చు. అందుకే మునుముందు ఏం జరగడానికైనా ఆస్కారం ఉందనేది అభిమానుల ఆందోళన. ఫైనల్ గా ఈ సాంగ్ మేకింగ్ కోసం కమల్ హాసన్ లిరిక్ ని రాయడమే గాక రాజ్ కమల్ ఫిలింస్ లో నిర్మించేందుకు పెట్టుబడులు పెట్టారు. వీడియో సాంగ్ ఇన్ స్టాంట్ కాఫీలా పెద్ద హిట్టయింది.