2024లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కోలీవుడ్ సినిమాలివే
అయితే కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కలిసిరాలేదని చెప్పాలి.
ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్స్ వచ్చాయి. అలాగే రెండు సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కలిసిరాలేదని చెప్పాలి. స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా క్లిక్ కాలేదు.
అయితే మీడియం బడ్జెట్, చిన్న సినిమాలుగా వచ్చినవి మాత్రం అంచనాలకి మించి సక్సెస్ ని అందుకున్నాయి. అలాంటివారిలో ‘అమరన్’, ‘మహారాజ’ లాంటి మూవీస్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ ఏడాది కోలీవుడ్ సినిమాలలో కొన్ని మాత్రమే ప్రభావం చూపించాయి. వాటిలో ఇళయదళపతి విజయ్ ‘ది గోట్’ మూవీ టాప్ 1లో ఉంది. ఈ చిత్రం 19.07 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది.
అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోలేక కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ ఏడాది కోలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా అంచనాలకి మించి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది.
ఇక చైనాలో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఏకంగా 13.45 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. దీని తర్వాత మూడో స్థానంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయాన్’ ఉంది. ఈ చిత్రం కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి 9.96 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి.
ఇక శివ కార్తికేయన్ సూపర్ హిట్ మూవీ ‘అమరన్’ వరల్డ్ వైడ్ గా 250 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. అలాగే ఈ ఏడాది కోలీవుడ్ బెస్ట్ సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఓవర్సీస్ లో 9.48 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ 10 తమిళ్ సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.
ది గోట్ - $19.07M
మహారాజ - $13.45M
వేట్టయాన్ - $9.96M
అమరన్ - $9.48M
ఇండియన్ 2 - $6.18M
రాయన్ - $4.95M
కంగువా - $2.85M
అరణ్మణై 4 - $2.35M
అయలాన్ - $2.23M
కెప్టెన్ మిల్లర్ - $2.20M