రాజకీయ నాయకుడిగానే పీకే ముగింపు!
అయితే ఈ సంవత్సరం మాత్రం రాజకీయ నాయకుడిగా పీకే అద్భుతాలు సృష్టించారు అన్నది వాస్తవం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అయింది. గత ఏడాది `బ్రో` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అందులో పీకే పోషించింది గాడ్ రోల్ కావడంతో? హీరో ఎలివేషన్ కి ఛాన్స్ లేని చిత్రమైంది. దీంతో పవన్ చివరి సినిమా 'భీమ్లా నాయక్' గానే చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పవన్ నుంచి సోలో రిలీజ్ లేదు. ప్రాజెక్ట్ లు కమిట్ అయినా వాటిని పూర్తి చేయడంలో విఫలమవుతున్నారు. చెప్పుకోవడానికి చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి.
కానీ వాటి షూటింగ్...రిలీజ్ రిస్థితి ఏంటి? అన్నది అర్దం కాని పరిస్థితి. 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇలా కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో రెండు చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి. దీంతో 2024ని కూడా పీకే ఎలాంటి రిలీజ్ లేకుండానే ముగించాల్సి వస్తోంది. అయితే ఈ సంవత్సరం మాత్రం రాజకీయ నాయకుడిగా పీకే అద్భుతాలు సృష్టించారు అన్నది వాస్తవం. బీజేపీ, టీడీపీ తో పార్టీతో కలిసి కూటమి గా ఏర్పడి ఏపీకి డిప్యూటీ సీఎం అవ్వగలిగారు.
పిఠాపురం నియోజక వర్గం నుంచి తొలిసారి గెలిసి ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా గెలుపు సాధ్యం కాలేదు. కానీ సీనియర్ నాయకుడకు చంద్రబాబు నాయడు సూచనలు , సలహాలు పాటించడంతో ఎమ్మెల్యే అవ్వగలిగారు. ఎన్డీయే కూటమి ఏర్పాటు లో పీకే కీలక పాత్ర పోషించారు. దీంతో దేశ వ్యాప్తంగా పవన్ పేరు బాగా వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకూ పవన్ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం.
అది చూసిన మోదీ , షా ద్వయం పవన్ కి పాన్ ఇండియా లెవల్లో బూస్టింగ్ ఇచ్చారు. ఆ రకంగా పవన్ పాన్ ఇండియా సినిమా తీయకముందే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా తీస్తే పొలిటికల్ క్రేజ్ తో దూసుకుపోతుంది. వచ్చే ఏడాది పీకే నటిస్తోన్న వీరమల్లు మార్చిలో రిలీజ్ పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.