అందాల రాణి కాస్త క‌నిపించ‌మ్మా?

అదే క్రేజ్ తో అటుపై రాజ‌కీయాల్లోనూ తెరంగే ట్రం చేసారు. అక్క‌డా త‌న‌దైన ముద్ర వేసారు.

Update: 2024-03-01 07:20 GMT

అందాల రాణి జ‌య‌ప్ర‌ద సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు..హిందీ భాష‌ల్లో ఎన్నో సినిమాల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్న న‌టి. మ‌ల‌యాళం ..త‌మిళ ..క‌న్న‌డ చిత్రాల్లో సైతం న‌టించి భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే లెజెండ‌రి న‌టిగా ఖ్యాతికెక్కారు. కోట్లాది మంది ప్రేక్ష‌కులు అభిమానించే గొప్ప తార‌గా వెలిగింది. అదే క్రేజ్ తో అటుపై రాజ‌కీయాల్లోనూ తెరంగే ట్రం చేసారు. అక్క‌డా త‌న‌దైన ముద్ర వేసారు. వివిధ పార్టీల్లో ప‌నిచేసి కీల‌క ప‌ద‌వుల్లో కొన‌సాగారు.


రాజ‌కీయం- సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసిన న‌టిగానూ జ‌య‌ప్ర‌ద‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. రాజ‌కీయానికి గ్లామ‌ర్ జోడిస్తే ఎలా ఉంటుంద‌న్న‌ది ఆమె రుజువు చేసి చూపించారు. ఇక రాజ‌కీయా లంటేనే వివాదాలు..విమ‌ర్శ‌లు స‌హ‌జం. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ల‌డ‌మే రాజకీయం. ఆ ర‌కంగా న‌టిగా అభిమానించినా...రాజీకీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసారు.

తాను చూసిన వైఫ‌ల్యాలు...వివాదాలు అంటూ ఎన్నో ఉన్నాయి. కానీ రెండున్న‌ర ద‌శాబ్ధాల రాజకీయ ప్ర‌యాణంలో ఏనాడు ఎదురుకాని సంఘ‌ట‌న తొలిసారి ఎదురైంది. తొలిసారి కోర్టు నుంచి నాన్ బెయిల‌బుల్ వారెంట్ అందుకున్నారు. ఇది అభిమానులు జీర్ణించుకోలేని అంశ‌మే అయినా అదే రాజ‌కీయం ఆమెపై ఓ మ‌చ్చ లా వేసింది. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియామ‌వ‌ళిని ఉల్లంఘించిన కేసులో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది.

ఆ వారెంట్ ని కొట్టేయాల‌ని అల‌హాబాద్ హైకోర్టులో జ‌య‌ప్రద పిటీష‌న్ దాఖ‌లు చేసినా చెల్ల‌దంటూ కోర్టు కొట్టేసింది. దీంతో జ‌య‌ప్ర‌ద అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప‌రారీలో ఉన్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్ర‌స్తుతం పోలీసులు ఆమెకోసం ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌ల‌కు దిగారు. జయప్రదను కోర్టులో హాజరుపరిచేందుకు ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ ఎపిసోడ్ కి ముగింపు ఎలా ఉంటుందన్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Tags:    

Similar News