లక్కీ భాస్కర్ OTT.. ఇది మామూలు విషయం కాదు..
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరీ జంటగా లక్కీ భాస్కర్ మూవీ చేసిన విషయం తెలిసిందే.;
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరీ జంటగా లక్కీ భాస్కర్ మూవీ చేసిన విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. దీపావళి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ సక్సెస్ గా మారింది.
బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, మధ్యతరగతి మనస్తత్వాలు.. వీటన్నింటినీ మేళవిస్తూ వెంకీ అట్లూరి ప్రేక్షకులకు కొత్త థ్రిల్ పంచారు. భాస్కర్ కుమార్ రోల్ లో దుల్కర్ యాక్టింగ్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో దుల్కర్ కు ఇది హ్యాట్రిక్ చిత్రంగా.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
అయితే నవంబర్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చిన లక్కీ భాస్కర్.. ఓ రేంజ్ లో అలరిస్తోంది. విడుదలైన నాటి నుంచి 13 వారాలపాటు నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో దూసుకెళ్తుండడం గమనార్హం. ఆ ఘనత అందుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.
అదే సమయంలో థియేట్రికల్ రన్ కన్నా ఓటీటీలో లక్కీ భాస్కర్ ఎక్కువగా దూకుడుగా ఉండడం గ్రేటే అనే చెప్పాలి. ముఖ్యంగా మూవీ కాన్సెప్ట్ 30 ఏళ్ల క్రితందే కానీ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలను మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఉండడంతో అందరినీ ఈజీగా ఆకట్టుకుంది. రిపీటెడ్ మోడ్ లో ఆడియన్స్ చూసేలా చేస్తుంది.
సినిమాలోని కొన్ని సీన్స్ వేరే లెవెల్ లో రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. అయితే విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్, ఫారిన్ లొకేషన్స్, స్పెషల్ సాంగ్స్ లేకపోయినా సినిమా విశేషంగా ఆకట్టుకోవడం గ్రేట్ అనే చెప్పాలి. ఒక కేస్ స్టడీ అని కూడా అందరూ చెబుతున్నారు. ఒక ప్రత్యేక ఉదహారణ అని అంతా అంటున్నారు.
స్టోరీ ఏంటి?
సినిమాలో భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) మిడిల్ క్లాస్ కు చెందిన ఓ ఎంప్లాయ్. ఆ సమయంలో చాలీచాలని జీతం, దానికి తోడు కుటుంబ భారమంతా ఒక్కడిపైనే ఉంటుంది. భార్య సుమతి (మీనాక్షి చౌదరీ)తో పాటు, కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడు అందరి బాధ్యతలు కూడా తనకే ఉంటాయి. దీంతో అప్పులు చేస్తాడు. ఆ తర్వాత రిస్క్ చేస్తాడు. మరి ఆయనేం చేశారు? చివరకు ఏం జరిగిందనేది మూవీ.