మా నాన్న సూపర్ హీరో సెన్సార్ రిపోర్ట్.. ఇది అసలు మ్యాటర్
టాలెంటడ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు అక్టోబర్ 10న ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
టాలెంటడ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు అక్టోబర్ 10న ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని అభిలాష్ రెడ్డి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించగా, CAM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు టీజర్ తోనే స్పష్టం అయ్యింది. ఇక సుధీర్ బాబు ఈ సినిమా రిజల్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కిందని ప్రమోషన్ చేస్తున్నారు. ఈ కారణంగానే మూవీపైన పాజిటివ్ బజ్ నడుస్తోంది. సుధీర్ బాబు హీరోగా అన్ని రకాల జోనర్ లలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అనిపించుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు. నటుడిగా డిఫరెంట్ వేరియేషన్స్ ఇవ్వగల టాలెంట్ సుధీర్ బాబుకి ఉందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
ఈ ఏడాది ‘హరోంహర’ సినిమాతో సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ తో మెప్పించిన కంటెంట్ వీక్ కావడంతో మూవీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో బలమైన పాయింట్ చెప్పబోతున్న నేపథ్యంలో కథపై చాలా నమ్మకంతో సుధీర్ బాబు ఉన్నారు. ప్రతి కొడుకు ఈ కథని తన స్టొరీగా అనుకునేలా ఇంటరెస్టింగ్ డ్రామాతో ప్రెజెంట్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ అయ్యింది.
సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దీనిని బట్టి కంప్లీట్ ఎమోషనల్ డ్రామాతోనే ఈ చిత్రంతో ఆడియన్స్ ని మెప్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు రెండు క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నట్లు టీజర్ బట్టి అర్ధమవుతోంది. అలాగే షియాజీ షిండే, సాయి చంద్ సుధీర్ బాబు తండ్రుల పాత్రలలో నటించారు. షియాజీ షిండేకి చాలా రోజుల తర్వాత ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాలో బలమైన క్యారెక్టర్ పడింది.
విలన్ పాత్రలని తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో రక్తికట్టించిన షియాజీ షిండే తండ్రి పాత్రలో కూడా అద్భుతంగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి పోటీగా రజినీకాంత్ ‘వేట్టయన్’, గోపీచంద్ ‘విశ్వం’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వాటి పోటీ తట్టుకొని మా నాన్న సూపర్ హీరో ఎంత వరకు నిలబడుతుందనేది చూడాలి.