'మా కాళీ' సినిమా.. టీజర్ ఎలా ఉందంటే?

అయితే మేకర్స్.. తాజాగా 'మా కాళీ' సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 'మనం 500 ఏళ్లపాటు హిందువులపై అధికారాన్ని చలాయించాం.. మరి ఇప్పుడు వారి అధికారంలో మనం ఉందామా'

Update: 2024-07-04 11:03 GMT

బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ ఫిమేల్ లీడ్ రోల్ లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మా కాళీ' పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి విజయ్ యాలకంటి దర్శకత్వం వహిస్తున్నారు. 1946 ఆగస్టు 16వ తేదీన బంగాల్ రాజధాని కలకత్తాలో జరిగిన ఓ ఉదంతం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో ఓవైపు కాళీ మాత, మరో వైపు ముస్లిం యువతి ఉన్నట్లు చూపించారు. అయితే పోస్టర్ రిలీజ్ తర్వాత తనకు బెదిరింపులు వస్తున్నాయని రైమా సేన్ ఆరోపించిన విషయం తెలిసిందే. సినిమా ఎందుకు ఒప్పుకున్నావంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, వాటిని భరించలేకపోతున్నట్లు కూడా తెలిపింది. ఏది పడితే అది అనేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే మేకర్స్.. తాజాగా 'మా కాళీ' సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 'మనం 500 ఏళ్లపాటు హిందువులపై అధికారాన్ని చలాయించాం.. మరి ఇప్పుడు వారి అధికారంలో మనం ఉందామా' అంటూ సభలో ఓ వ్యక్తి మాట్లాడుతున్న సీన్ తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నట్లు చూపించారు. 'హిందుస్థాన్ కు అధికారం బదిలీ చేయించాలని బ్రిటిష్ సర్కార్ నిర్ణయించింది. హిందువులు పగటి కళలు కంటున్నారు' అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో డైలాగ్ వచ్చింది.

Read more!

ఆ తర్వాత రెండు వర్గాల ప్రజల మధ్య గొడవ జరుగుతున్నట్లు చూపించారు. కాళీ మాత విగ్రహం కూడా పడేసినట్లు కనిపించింది. చివరకు మ్యాన్ హోల్ లో ఒక మనిషి మృతదేహం ఉండగా.. మూత మూసేశారు. ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో టీజర్ ముగిసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజ జీవిత ఘటనల ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తుంటే క్లారిటీ వచ్చేసింది. మూవీపై ఆసక్తి పెంచుతోంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. అభిషేక్ సింగ్ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, కిరణ్ గంటి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అనురాగ్ హల్డర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రూషిన్ దలాల్, కైజాద్ గెర్డా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. తెలుగు, హిందీ, బెంగాలీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News

eac