డెవిల్ తో సంయుక్త రొమాంటిక్ సాంగ్..!

'మాయ చేశావే' అంటూ సాగే పాట ఇది. ఐకాన్ మ్యూజిక్ ఈ పాటను విడుదల చేయడం విశేషం. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇప్పటి వరకు సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ హిట్లే.

Update: 2023-09-19 12:08 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డెవిల్. కళ్యాణ్ రామ్ ప్రతిసారి విభిన్నమైన కథలతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సారి డెవిల్ రూపంలో అలరించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకి 'బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' ట్యాగ్ లైన్ పెట్టడం విశేషం.


ఈ సినిమాకి సంబంధించి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ తో హైప్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత రీసెంట్ గా ఈ మూవీలో హీరోయిన్ సంయుక్తా మేనన్ లుక్ విడుదల చేశారు. అందులో ఆమె పట్టుచీరలో చందమామలా కనిపించింది. అయితే, ఇప్పుడు హీరో, హీరోయిన్ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు.

'మాయ చేశావే' అంటూ సాగే పాట ఇది. ఐకాన్ మ్యూజిక్ ఈ పాటను విడుదల చేయడం విశేషం. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇప్పటి వరకు సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ హిట్లే. ఈ పాట కూడా అదేవిధంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది అద్బుతమైన మెలడీ సాంగ్ కావడం విశేషం. స్వాతంత్ర్యం రాకముందు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కించగా, పాటలోనూ ఈ అంశాలు క్లియర్ గా కనపడుతున్నాయి.

హీరో హీరోయిన్ల కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మేకప్ లాంటి విషయంలోనూ ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ పాట ఈ ఏడాది మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ సాంగ్ అవుతుందని మూవీ టీమ్ భావిస్తోంది. బృంద మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. హర్షవర్థన్ రామేశ్వర్ రెట్రో ట్రాక్ అందించారు. పాటకు తగినట్లు కళ్యాన్ రామ్, సంయుక్త తమ స్టెప్స్ తో అదరగొట్టారు. వీరి మధ్య కెమిస్ట్రీ ఈ మూవీ మరింత ప్లస్ కానుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమా నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అభిషేక్ పిక్చర్స్' బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన గ్లింప్స్, పోస్ట‌ర్స్ సినిమాపై చాలా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చాయి. 1940 బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి నిర్మాతలు భారీ బడ్జెట్‌తో ఖర్చు చేస్తున్నారు. అమిగోస్ తో ప్లాప్ ఎదుర్కొన్న కళ్యాన్ రామ్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Full View
Tags:    

Similar News