మ్యాడ్ స్క్వేర్.. నాగవంశీ పర్ఫెక్ట్ స్ట్రాటజీ
కథ లేకున్నా కేవలం కామెడీతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలం అని నిరూపించిన కొన్ని సినిమాలు టాలీవుడ్‌లో మంచి లాభాలు అందించాయి.;
కథ లేకున్నా కేవలం కామెడీతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలం అని నిరూపించిన కొన్ని సినిమాలు టాలీవుడ్‌లో మంచి లాభాలు అందించాయి. వాటి సరసన ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా చేరనుందని స్పష్టమవుతోంది. నిర్మాత నాగవంశీ స్వయంగా ఇదే మాటను చెబుతూ, ఈ సినిమాను కేవలం రెండు గంటల నవ్వుల విందుగా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ‘జాతి రత్నాలు’ కూడా ఇదే తరహా ప్రమోషన్‌తో హిట్ అవ్వగా, ఇటీవల ‘మ్యాడ్’ కూడా అలాంటి ఫార్ములాతో సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆ మ్యాజిక్ మ్యాడ్ స్క్వేర్ మళ్లీ రిపీట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే టీజర్ చూస్తేనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. కథకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, క్యారెక్టర్స్, పంచ్‌లే ప్రధాన బలం. సాంగ్స్ కూడా అదే ఎనర్జీని ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయి. ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇలాంటి సినిమాల్లో డైలాగ్‌లు, బీటింగ్ పంచ్‌లు ఎంత సూపర్‌గా ఉంటాయో ప్రేక్షకులు ఆశిస్తున్నారు. గతంలో ‘మ్యాడ్’లో అదే బాగా వర్క్ అయ్యింది.
ఈ సారి కథా వేదిక హైదరాబాదులో కాకుండా గోవా. అక్కడ ముగ్గురు వెధవలు ఇంకో మంచోడిని వెధవను చేయడానికి చేసే ప్రయత్నాలే కథాంశమట. ఇలాంటి కథా నేపథ్యం అంటే అసలు కథ లేకపోవడమే ప్రధాన విషయం. కానీ ఇదే బలం అవుతుందన్న నమ్మకంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. జాతి రత్నాలు సినిమా టైంలోనూ ఇదే పద్ధతిని ఫాలో అవ్వడంతో ప్రేక్షకులు సూపర్‌గా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు, ప్రేక్షకులకు ముందే క్లారిటీ ఇవ్వడం కూడా ఈ తరహా సినిమాల విజయంలో ప్రధాన మంత్రంగా మారుతోంది.
నాగవంశీ మాటలు చూస్తే, కామెడీ సినిమాలకు ఇక లాజిక్స్ వదిలేసి ఎంజాయ్ చేయాలనే కొత్త ట్రెండ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలకు అలసిపోయి, కాస్త ఫన్ కోసం అలాంటి సినిమాలకు వెళ్తున్నారు. గతంలో ‘మ్యాడ్’, ‘జాతి రత్నాలు’ లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తే చాలు అనే స్ట్రాటజీతో హిట్ కొట్టాయి. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా అదే పంథాలో వచ్చింది.
ఇదిలా ఉంటే, మేల్ లీడ్స్ అయిన సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల కాంబో మరింత ఎనర్జీని తెచ్చేలా ఉంది. ఈ తరహా స్క్రిప్ట్‌లకు కేవలం నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్ చాలా ముఖ్యం. అందుకే, క్యాస్టింగ్ పరంగా మ్యాడ్ టైప్ సినిమాలకు సరిగ్గా సరిపోయే నటీనటులనే తీసుకున్నారు. అల్లరి, ఫన్, పంచ్‌లతో కలిపి పెట్టిన ఈ సినిమా టీజర్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక సినిమా విడుదల మార్చి 29న కానుంది. ఇదే టైంలో పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. మ్యాడ్ లాగా మౌత్ టాక్ బాగుంటే, దీని రన్ కూడా అదే స్థాయిలో ఉండొచ్చనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. మరి మ్యాడ్ స్క్వేర్ మరోసారి థియేటర్లలో నవ్వుల విందుగా మారుతుందా అనేది చూడాలి.