మ్యాడ్ స్క్వేర్.. అదొక్కటే మైనస్!

అయితే మ్యాడ్ స్క్వేర్ కు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సగటు సమీక్షలను అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇస్తోంది.;

Update: 2025-03-30 15:30 GMT
మ్యాడ్ స్క్వేర్.. అదొక్కటే మైనస్!

యువ నటులు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. 2023లో వచ్చి మంచి హిట్ అయిన మ్యాడ్ కు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమాను కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ మ్యాడ్ స్క్వేర్.

అయితే మ్యాడ్ స్క్వేర్ కు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సగటు సమీక్షలను అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇస్తోంది. అంచనాలకు మించి వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నారు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్.

ముగ్గురు కూడా మరోసారి మ్యాడ్ స్క్వేర్ లో కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. అయితే మూవీలోని పాటలకు భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ ఇవ్వగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. కానీ సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. పేలవంగా ఉన్నాయని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మ్యాడ్ విషయంలో మాత్రం సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్య పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. యూత్ లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు మ్యాడ్ స్కోర్ విషయంలో ఆడియో ఆల్బమ్ ఆకర్షించ లేకపోయింది. స్వాతి రెడ్డి సాంగ్ తప్ప భీమ్స్ మిగతా పాటలేవీ.. ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు.

సినిమాకు తమన్ స్వరపరిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా క్లిక్ అవ్వలేదనే చెప్పాలి. దీంతో సీక్వెల్.. అంచనాలను అందుకోకపోవడంలో సౌండ్ ట్రాక్ కూడా ఒక భాగమనే చెప్పాలి. ఏదేమైనా సినిమా మాత్రం వసూళ్ళ పరంగా అదరగొడుతోంది. థియేటర్లలో మ్యాడ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటూ అంటూ రీసెంట్ గా మేకర్స్ తెలిపారు.

ఇక మూవీ విషయానికొస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక, సాయి సౌజన్య నిర్మించారు. నిర్మాత నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ తో పాటు విష్ణు ఓయ్ మెప్పించారు. మురళీధర్ గౌడ్, ప్రియాంక జవాల్కర్, రఘుబాబు, అనుష్ కురివిళ్ళ, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటించారు. మరి మీరు మ్యాడ్ స్క్వేర్ ను చూశారా?

Tags:    

Similar News