హీరోయిన్స్ లేకుండా యూత్ సినిమానా.. అదెలా..?

రెండేళ్ల క్రితం మ్యాడ్ అంటూ వచ్చి యువతని మెప్పించిన ఆ టీం మళ్లీ మ్యాడ్ రెండో డోస్ అదే మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నారు.

Update: 2025-03-01 18:58 GMT

ఒక యూత్ సినిమా అంటే అందులో కచ్చితంగా హీరోయిన్స్ కూడా కలర్ ఫుల్ గా ఉండాలి. యూత్ ఆడియన్స్ సినిమాలను చూసేదే వాళ్లని మెప్పించే యూత్ కంటెంట్ సినిమాలో ఉంటుందని. ఐతే త్వరలో రాబోతున్న ఒక యూత్ సినిమా మాత్రం హీరోయిన్స్ లేకుండానే ప్రయోగం చేసినట్టు తెలుస్తుంది. రెండేళ్ల క్రితం మ్యాడ్ అంటూ వచ్చి యువతని మెప్పించిన ఆ టీం మళ్లీ మ్యాడ్ రెండో డోస్ అదే మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.

ఈ సినిమాకు సంబందించిన ప్రెస్ మీట్ లేటెస్ట్ గా జరగగా.. అందులో ఈ సినిమాలో హీరోయిన్స్ ఉండరు ప్రతి పావు గంట అరగంటకు ఒక అమ్మాయి వచ్చి వెళ్తుందని అన్నారు. ఇదేంటి హీరోయిన్స్ లేకుండా ఇది యూత్ సినిమా ఎలా అవుతుంది అనే డౌట్ మొదలైంది. మ్యాడ్ సినిమాలో నడిపించిన లవ్ ట్రాకులు ఇందులో ఉండవని స్పష్టమవుతుంది. ఐతే సందర్భాన్ని బట్టి అమ్మాయిలు వచ్చి వెళ్తుంటారు.

ఐతే హీరోలు ముగ్గురు ఉండి హీరోయిన్ ఒక్కరు కూడా లేకపోతే బోర్ కొట్టేయదా అంటే దానికి మ్యాడ్ స్క్వేర్ లో వేరే సెటప్ చేసినట్టు తెలుస్తుంది. మ్యాడ్ సీక్వెల్ గా రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ నెక్స్ట్ లెవెల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. ఐతే ఈ సినిమాలో స్టార్ కమెడియన్ సునీల్ కూడా ఉంటారని తెలుస్తుంది. సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మ్యాడ్ స్క్వేర్ లో కథానాయికలు లేని లోటుని ఎలా తీరుస్తారా అని ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. మ్యాడ్ హిట్ కాబట్టి ఈ సీక్వెల్ కూడా అదే రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నారు. ఐతే మ్యాడ్ స్క్వేర్ విషయంలో యూత్ ఆడియన్స్ ఇప్పటికే అంచనాలు పెంచుకున్నారు. మరి సినిమా అందుకు తగినట్టుగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.

మేకర్స్ మాత్రం యూత్ ఆడియన్స్ కి నచ్చే అన్ని అంశాలు ఇందులో పొందు పరిచినట్టు చెబుతున్నారు. సినిమా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఓపెనింగ్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. సితార బ్యానర్ నుంచి వస్తున్న యూత్ ఫుల్ సినిమా అంటే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ సరసన ఈ మ్యాడ్ స్క్వేర్ కూడా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మరి ఆ రిజల్ట్ ఏంటన్నది సినిమా వస్తేనే చెప్పగలం.

Tags:    

Similar News