యూత్ స్టార్ కి పోటీగా యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్!

యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ `మ్యాడ్` ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలిసిందే. ఆ సినిమా విజ‌యంతో పాటు మ్యూజిక‌ల్ గానూ పెద్ద విజ‌యం సాధించింది.

Update: 2024-12-14 11:28 GMT

యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ `మ్యాడ్` ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలిసిందే. ఆ సినిమా విజ‌యంతో పాటు మ్యూజిక‌ల్ గానూ పెద్ద విజ‌యం సాధించింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో న‌టించ‌గా, గౌరీ ప్రియ, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉదయన్ కథానాయికలుగా నటించారు. క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఈ సినిమా సీక్వెల్ కూడా మ్యాడ్ స్కేర్ తెర‌కెక్కుతుంది. ఈ సీక్వెల్ పైనా అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ఇప్ప‌టికే ఈ చిత్రం రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల‌తో డిలే అవుతుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని నితిన్ హీరోగా న‌టిస్తోన్న `త‌మ్ముడు` చిత్రానికి పోటీగా దించుతున్న‌ట్లు స‌మాచారం. 2025 మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా త‌మ్ముడు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో `మ్యాడ్ స్వ్కేర్` ని కూడా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ప్రియాంక జ‌వాల్క‌ర్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ‘లడ్డు గానీ పెళ్లి’ పాట రిలీజ్ అయింది. అది సాలిడ్ హిట్ అయింది. త్వ‌ర‌లో మిగ‌తా సింగిల్స్ కూడా రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అలాగే జ‌న‌వ‌రి నుంచి ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నారు. న్యూ ఇయ‌ర్ , సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా అప్ డేట్స్ ఇచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తుందిట‌.

యూత్ పుల్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా క్రేజీ అప్ డేట్ ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్- ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News