మ్యాడ్ స్క్వేర్.. రిలీజ్ అప్పుడేనా?
కానీ పలు సినిమాలు అప్పుడు రిలీజ్ అవుతుండడంతో ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నెల మధ్యలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఆ సినిమా.. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లను సాధించింది.
మ్యాడ్ మూవీకి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సూర్య దేవర హారిక, సాయి సౌజన్య నిర్మించారు. అయితే అప్పుడే మేకర్స్.. సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలైనట్లు వెల్లడించారు. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
మ్యాడ్ లో కాలేజీ లైఫ్ ను చూపించిన మేకర్స్.. మ్యాడ్ స్క్వేర్ లో ముగ్గురు హీరోల ఫ్యామిలీ లైఫ్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఫన్ రైడ్ లా ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటికే సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్.. చొక్కా, లుంగీలతో స్టైలిష్ గా ఉన్న పోస్టర్ తోపాటు లడ్డూగాని పెళ్లి సాంగ్ ను విడుదల చేశారు.
లడ్డూగాని పెళ్లి సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలవబోతుందని వీడియో సాంగ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అలా ఫస్ట్ అప్డేట్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. సినిమా రిలీజ్ కు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట.
అయితే మ్యాడ్ సీక్వెల్ ను జనవరిలో రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారట. కానీ పలు సినిమాలు అప్పుడు రిలీజ్ అవుతుండడంతో ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నెల మధ్యలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్.
ఇక ఫస్ట్ పార్ట్ దర్శకుడు, నిర్మాతలే సీక్వెల్ కూడా వర్క్ చేస్తున్నారు. కానీ హీరోయిన్స్ మారనున్నట్లు తెలుస్తోంది. శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్ కుమార్, గోపికా ఉద్యన్ బదులు వేరే ముద్దుగుమ్మలు నటిస్తున్నారని సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మరి మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలా ఉంటుందో చూడాలి.